Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తోన్న సినిమా ‘పుష్ప ’. ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం… రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ను క్రిస్మస్ కానుకగా… డిసెంబర్ 17న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ , సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమాలో రష్మిక మందాన్న హీరోయిన్ గా నటిస్తుండగా… ఆమె శ్రీవల్లి అనే పాత్రలో కనిపించునున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమాలో రష్మిక మందన కు సంబంధించి ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. అయితే తాజాగా… పుష్ప నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. పుష్ప సినిమా నుంచి శ్రీవల్లి ఫుల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. ” చూపే బంగార మాయేనా శ్రీవల్లి… అంటూ చంద్రబోస్ రాసిన రిలిక్స్ అందరినీ అలరిస్తున్నాయి. ఈ పాటను సిద్ది శ్రీరామ్ పాడగా … ఈ పాటతో సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగాయి.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమాకు చెందిన మొదటి భాగం షూటింగ్ ఇటీవల ఏపీలోని మారేడు మిల్లి అడువుల్లో జరిగింది. అక్కడే పదిహేను రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది పుష్ప టీమ్. ప్రస్తుతం హైదరాబాద్‌లో సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలో ముందుగా రిలీజ్ అయిన దాక్కో దాక్కో మేక అనే పాట యూట్యూబ్ లో ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది.