
Karthika Deepam Today Episode: బుల్లితెరపై ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ ఈ రోజు రోజుకి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకుంటుంది. తాజాగా నేటి ఎపిసోడ్ లో భాగంగా హిమ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ కార్తీక్ బాధపడుతుండగా ఆదిత్య అమెరికా వెళ్ళిపొమ్మని సలహా ఇస్తాడు. ఆలోపే దీప వచ్చి పిల్లలు బస్తి వెళ్దాం అంటున్నారు అని చెప్పడంతో ఆ మాట విన్న కార్తిక్ షాక్ అయ్యి చూశావా మమ్మీ పిల్లలు నా మొహం చూడటానికి కూడా ఇష్టపడడం లేదంటూ బాధపడతారు. ఆ మాటలు విన్న దీప డాక్టర్ బాబు పిల్లలు వెళ్తాను అంటున్నారు కానీ వెళ్దామని నేను అనడం లేదు కదా..అని చెప్పగా ఆదిత్య మరోసారి అమెరికా ప్రయాణం గురించి ఆలోచించు అన్నయ్యా అంటూ సలహా ఇచ్చి వెళ్తాడు. ఇదంతా దూరం నుంచి ప్రియమణి చూస్తూ ఉంటుంది.
ఇక హిమ సౌర్య బాధగా ఏడుస్తూ కూర్చొని ఉండగా సౌర్య హిమను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. హిమ కొన్నిసార్లు మనం తప్పుగా ఆలోచిస్తాము. మనం ఆలోచించేది కొన్నిసార్లు కరెక్ట్ కాకపోవచ్చు అని చెప్పడంతో అందుకు హిమ మాట్లాడుతూ నేను హాస్పిటల్ కి వెళ్ళింది వాళ్ళిద్దరికీ తెలియదు అలాంటప్పుడు అబద్దాలు ఎందుకు మాట్లాడుతారు. మోనిత ఆంటీ అన్ని ప్రశ్నలు వేసుకుంటే డాడీ ఒక్కసారి కూడా ఇది అబద్దం అని అనలేదు. ఒకసారి మోనిత ఆంటీ జైలు నుంచి వచ్చిన తర్వాత నిజంగానే డాడీ ఆమెను పెళ్లి చేసుకుంటే మనం తిరిగి ఏ విజయనగరమో విజయవాడో వెళ్లాలి అంటూ హిమ చెప్పగా అందుకు సౌర్య నీ మాటల్లో కూడా నిజం ఉంది ఆలోచిస్తుంటే డాడీ బ్యాడ్ బాయ్ అనిపిస్తుంది అంటూ మాట్లాడుతారు.
ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఉమాదేవి అలియాస్ అర్థ పావు భాగ్యం బిగ్ బాస్ హౌస్ లో ప్రకటించినట్టుగానే ప్రవర్తిస్తుండడంతో మురళీకృష్ణ ఒక్కసారిగా ఆమెపై కర్ర ఎత్తడంతో దెబ్బకు భాగ్యం మామూలు స్థితికి చేరుకుంటుంది. ఇక భాగ్యాన్ని కూర్చోబెట్టుకొని మురళీకృష్ణ జరిగిన విషయాలన్నీ చూపి ఒకసారి దీపను వెళ్లి కలిసిరా అంటూ చెబుతాడు. ఇకపోతే కార్తీక్ అమెరికా వెళ్లాలనుకుంటున్న విషయాన్ని ప్రియమణి సుకన్యకు ఫోన్ చేసి చెప్పడంతో సుకన్య ఈ విషయాన్ని మోనిత దగ్గరకు తీసుకువచ్చి ఎవరో ఆదిత్య అట కార్తీక్ ను అమెరికా వెళ్ళమని సలహా ఇస్తున్నాడు అని చెప్పడంతో మోనిత కోపంతో రగిలిపోతుంది. ఎలాగైనా ఆ ప్రయాణాన్ని ఆపాలి అని మనసులో అనుకుంటుంది.
ఇక పిల్లలు వారి బ్యాగులను సర్దుకొని భక్తి వెళ్ళడానికి సిద్ధమయ్యారు వారణాసికి ఫోన్ చేశాను అతను వచ్చి తీసుకెళ్తాడు అంటూ చెబుతుండగా కార్తీక్ అక్కడకు వచ్చి ఏంట్రా మీ డాడీని వదిలి వెళ్ళిపోతారా అలా చేయకండి అంటూ వారిని దగ్గర తీసుకోవాలని ప్రయత్నిస్తే పిల్లలు దీపా చాటుకు వెళ్లి దాక్కుంటారు. ఇక కార్తీక్ నేలపై కూలబడి ఇంతకన్నా నేను మిమ్మల్ని ప్రాధేయ పడను చేతులు జోడించి అడుగుతున్న అక్కడికి వెళ్ళకండి అంటూ బాధపడతాడు. దాంతో దీప పిల్లలిద్దరినీ లోపలికి తీసుకెళుతుంది.
ఆ సంఘటన చూసిన ఆదిత్య కార్తీక్ దగ్గరకు వచ్చి ముందు మీరు అమెరికా వెళ్లిపోండి అన్నయ్య అని అనగా మీ వదినకి ఇష్టం లేనట్టు ఉంది అంటూ కార్తీక్ చెప్పడంతో వదినను నేను ఒప్పిస్తాను అంటాడు.అంతలోగా దీప పరిగెత్తుకు వస్తూ డాక్టర్ బాబు హిమ వళ్లు కాలిపోతుందని చెప్పగా అందరూ అక్కడకు పరుగులు పెడతారు. అప్పటికే ప్రియమణి హిమకు తడిగుడ్డతో తుడుస్తూ వాళ్లు వచ్చేలోగా పెళ్లి కాక ముందు నుంచి మీ డాడీ మోనిత ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. వాళ్లు కలిస్తే ఏంటి కలవకపోతే ఏంటి.. వాళ్ళిద్దరు కలవచ్చేమో అంటూ మాట్లాడుతూ హిమ మనసులో మరొక విషపు బీజం నాటుతోంది. వాళ్ల గురించి నువ్వు ఆలోచిస్తూ ఎందుకు జ్వరం తెచ్చుకున్నావ్ అమ్మా అంటూ నటిస్తోంది.