Srikanth Addala
Srikanth Addala :తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న శ్రీకాంత్ అడ్డాల తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సినిమాలు చేసే ప్రాసెస్ లో బిజీగా ఉన్నాడు. ఒకప్పుడు మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించిన ఆయన ఇప్పుడు మాత్రం తన పూర్తి ఫామ్ ను అందుకోలేకపోతున్నాడు. తద్వారా ఆయన యంగ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక గతంలో ఈయన చేసిన ‘పెదకాపు’ (Pedakapu) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఆ సినిమాకి సెకండ్ పార్ట్ తీద్దామని చెప్పినప్పటికి సినిమా ప్లాప్ అవ్వడంతో అది అంతటి తోనే ఆగిపోయింది. మరి ఇప్పుడు ఆయన మరొక హీరోతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రీ రిలీజ్ అయిన నేపథ్యంలో శ్రీకాంత్ అడ్డాలకు సంబంధించిన టాపిక్ మరోసారి హైలెట్ గా నిలుస్తున్నాయి.
Also Read : క్లాస్ ఆ .. మాస్ ఆ..శ్రీకాంత్ అడ్ఠాల ఆఖరికి ఏ పక్క గెలుస్తారు..?
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఆయన గురించి ఒక న్యూస్ అయితే విపరీతంగా చక్కర్లు కొడుతుంది అది ఏంటి అంటే ఆయనకు పెదకాపు సినిమాలో చేసినటువంటి ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉందనే వార్తలైతే వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అంటూ కొంత మంది సినిమా మేధావులు సైతం ఈ విషయం మీద వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
రీసెంట్ గా తమిళ్ నటుడు ఆయన పార్తిబన్ శ్రీకాంత్ అడ్డాలకు తనకి మంచి రిలేషన్ షిప్ ఉందని వాళ్ళ మధ్య మంచి స్నేహపూరితమైన సంబంధాలు ఉన్నాయని తెలియజేశాడు. దాంతో పాటుగా ఆయన మీద వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ ఆయనకి ఎవ్వరితో ఎలాంటి ఎఫైర్ లేదని కావాలనే కొంతమంది ఇలాంటి వార్తలను క్రియేట్ చేస్తున్నారు అంటూ ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
మరి మొత్తానికైతే శ్రీకాంత్ అడ్డాల రాబోయే సినిమాలతో మంచి విజయాలను సాధించి మరోసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక బ్రహ్మోత్సవం సినిమాతో ఆయనకి భారీగా దెబ్బ పడింది…మరి ఇప్పటికైనా ఆయన సక్సెస్ ట్రాక్ ఎక్కి మంచి సినిమాలను చేస్తూ భారీ విజయాలను సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : వీళ్ళు డైరెక్టర్లు అవ్వక ముందు కొన్ని సినిమాల్లో నటించారు…ఆ సినిమాలేంటో తెలుసా..?