https://oktelugu.com/

Tollywood Directors: వీళ్ళు డైరెక్టర్లు అవ్వక ముందు కొన్ని సినిమాల్లో నటించారు…ఆ సినిమాలేంటో తెలుసా..?

పూరి లాంటి స్టార్ డైరెక్టర్ కూడా నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమాలో నాగార్జున వెనక ఉండే ఫ్రెండ్ క్యారెక్టర్ లో ఒకరిగా నటించాడు.

Written By:
  • Gopi
  • , Updated On : March 2, 2024 / 03:19 PM IST
    Follow us on

    Tollywood Directors: ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్లు దర్శకులుగా మారే ముందు అంటే అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్నప్పుడే కొన్ని సినిమాల్లో నటిస్తూ మనకు కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్లు అందరూ కూడా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన వారే కావడం విశేషం…

    ఇక అందులో పూరి లాంటి స్టార్ డైరెక్టర్ కూడా నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమాలో నాగార్జున వెనక ఉండే ఫ్రెండ్ క్యారెక్టర్ లో ఒకరిగా నటించాడు. అయితే ఈ విషయం అప్పట్లో ఎవరికి తెలియదు కానీ, ప్రస్తుతం పూరి జగన్నాథ్(Puri Jagannadh) స్టార్ డైరెక్టర్ అయ్యాడు కాబట్టి ఆ ఫోటోలని చూపిస్తూ పూరి శివ సినిమాలో నటించాడు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది…

    ఇక పూరి తో పాటు మరికొంతమంది డైరెక్టర్లు కూడా కొన్ని సినిమాల్లో నటించారు వాళ్ళు ఎవరో ఒకసారి తెలుసుకుందాం…

    కొత్త బంగారులోకం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala)… ఈ సినిమాకి ముందు బొమ్మరిల్లు భాస్కర్ దగ్గర బొమ్మరిల్లు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో సిద్దార్థ్ కి డ్రెస్ తీసుకోవడానికి వాళ్ళ నాన్న షాపింగ్ మాల్ కి తీసుకెళ్తాడు. ఆ షాపింగ్ మాల్ లో సేల్స్ భాయ్ గా శ్రీకాంత్ అడ్డాల కనిపిస్తాడు…

    ఇక వంశీ పైడిపల్లి(Vamshi Paidipally) కూడా తను దర్శకుడు అవ్వడానికి ముందు బోయపాటి శ్రీను దగ్గర భద్ర సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ వెనకాల ఉండే కొంతమందిలో వంశీ పైడిపల్లి నిల్చొని ఉంటాడు.

    ఇక హరీష్ శంకర్(Harish Shankar) లాంటి డైరెక్టర్ కూడా ఏ ఫిల్మ్ బై అరవింద్ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో కనిపిస్తాడు…

    ఇలా ఒకరు ఇద్దరనే కాదు చాలామంది దర్శకులు వాళ్ళు దర్శకులు అవ్వడానికి ముందు చాలా సినిమాల్లో కనిపించిన వారే కావడం విశేషం…