https://oktelugu.com/

CM Chandrababu: తిరుమలలో చంద్రబాబు కుటుంబం.. భక్తుల ఒకరోజు అన్నదానానికి విరాళం!

CM Chandrababu ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు తిరుమల( Tirumala) రావడం ఇది రెండోసారి. ఉదయం సాధారణ భక్తులు మాదిరిగా చంద్రబాబు కుటుంబం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి ప్రవేశించారు.

Written By: , Updated On : March 21, 2025 / 12:19 PM IST
CM Chandrababu (4)

CM Chandrababu (4)

Follow us on

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు పురస్కరించుకొని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణితో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకులు మండపంలో ఆలయ పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు స్వామి వారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని, శ్రీవారి శాస వస్త్రాన్ని అందజేశారు.

Also Read: ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా.. రాజకీయాల్లో వైవిధ్యం

* సాధారణ భక్తులు మాదిరిగా..
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు తిరుమల( Tirumala) రావడం ఇది రెండోసారి. ఉదయం సాధారణ భక్తులు మాదిరిగా చంద్రబాబు కుటుంబం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి ప్రవేశించారు. యు కాంప్లెక్స్ వద్ద చంద్రబాబుకు టీటీడీ ఈవో శ్యామలరావు స్వాగతం పలికారు. ఆలయ మహాద్వారం వద్ద చేరుకున్న చంద్రబాబుకు శ్రీవారి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు ధ్వజస్తంభాన్ని తాకి నమస్కరించారు. ఆలయ ప్రవేశం చేశారు.

* ఏటా వేడుకగా..
లోకేష్ తనయుడు దేవాన్స్ ( Devansh)ప్రతి పుట్టినరోజు తిరుమలలో వేడుకగా జరుపుకోవాలని ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి దర్శనం అనంతరం చంద్రబాబు కుటుంబం తరిగొండ వెంగమాంబ సత్రంలో అన్నదానం నిర్వహించారు. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణీలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు తిరుమలనుంచి హైదరాబాద్ చేరుకుంటారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు 44 లక్షల రూపాయల విరాళంగా అందజేసింది. అంటే ఒక్కరోజు అన్నప్రసాదానికి అయ్యే ఖర్చును ఆ కుటుంబం భరించింది. ఏటా ఇదే ఆనవాయితీని కొనసాగిస్తూ వచ్చారు చంద్రబాబు. ఈ ఏడాది కూడా అందించి రికార్డు సృష్టించారు.

* మూడుసార్లు తిరుమల వచ్చినా
ముఖ్యమంత్రి అయ్యాక తిరుమలలో శ్రీవారిని( Lord Venkateswara ) చంద్రబాబు దర్శించుకోవడం ఇది రెండోసారి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేరుగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అయితే మధ్యలో తిరుపతి తొక్కిసలాట ఘటన సమయంలో వచ్చారు కానీ.. అప్పట్లో సమీక్షలు జరిపి వెళ్లిపోయారు. ఇప్పుడు మనవడు దేవాన్సు పుట్టినరోజు కావడంతో స్వామివారి ఆశీస్సుల కోసం కుటుంబ సమేతంగా వచ్చారు చంద్రబాబు. చంద్రబాబు కుటుంబం రాకతో తిరుమలలో సందడి వాతావరణం కనిపించింది. నేతల తాకిడి అధికంగా ఉంది.