Hari Teja: విడాకులు తీసుకుంటున్న హరితేజ..? క్లారిటీ వచ్చేసిందిగా..

కన్నడకు చెందిన దీపక్ అనే వ్యక్తిని 2015లో హరితేజ వివాహం చేసుకుంది. వీరికి 2021లో భూమి అనే కూతురు కూడా జన్మించింది. ఇక బిడ్డ పుట్టాకా హరితేజ కొద్దిగా బరువు పెరిగినా తర్వాత కష్టపడి బరువు తగ్గడమే కాకుండా చాలా స్లిమ్‌గా తయారయ్యింది.

Written By: Suresh, Updated On : September 30, 2023 12:26 pm

Hari Teja

Follow us on

Hari Teja: బుల్లితెర వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన బ్యూటీ హరితేజ. ఈమె నటిస్తే అమాయకత్వం, కొంటెతనం, అల్లరి అన్నీ కలబోసుకొని మరీ నటిస్తుంది.అంతే కాదు ఆన్‌ స్క్రీన్‌పైనే కాదు ఆఫ్‌ స్క్రీన్‌లోనూ మహా చలాకీగా ఉంటుంది హరి. సినిమాల్లో తన యాక్టింగ్‌తో అలరించే ఆమె బుల్లితెర షోలలో తనదైన పంచ్‌ డైలాగులతో కడుపుబ్బా నవ్విస్తుంది. అంతేకాదు సెటైరికల్‌ కామెంట్స్‌తో ఇంచుమించు మరో సూర్యకాంతంలా పేరు సంపాదించుకుందంటూ ఓ ఈవెంట్‌లో ఏకంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అన్న విషయం తెలిసిందే.. అందుకే ఆమెకు నితిన్‌,సమంత ‘అఆ’ సినిమాలో ఛాన్స్‌ ఇచ్చారు ఆయన. ఇక బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన హరి టాప్ 5 లో నిలిచి శభాష్ అనిపించుకుంది.

కన్నడకు చెందిన దీపక్ అనే వ్యక్తిని 2015లో హరితేజ వివాహం చేసుకుంది. వీరికి 2021లో భూమి అనే కూతురు కూడా జన్మించింది. ఇక బిడ్డ పుట్టాకా హరితేజ కొద్దిగా బరువు పెరిగినా తర్వాత కష్టపడి బరువు తగ్గడమే కాకుండా చాలా స్లిమ్‌గా తయారయ్యింది. తాజాగా ఈ బ్యూటీ ఆస్ట్రేలియాలో సింగిల్‌గానే వెకేషన్‌ మూడ్‌లో ఉంది. కుమార్తెను కూడా తన తల్లి దగ్గర వదిలి తెగ ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ.

ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తరువాత అభిమానులతో చిట్ చాట్ సెషన్ ప్రారంభించిన హరితేజను ఒక నెటిజన్‌ ఇలా అడిగాడు… మీ భర్త దీపక్‌తో విడాకులు తీసుకున్నారా…? అని ప్రశ్నించాడు. దీనిని హరితేజ కూడా నవ్వుతూ చాలా హుందాగా తనదైన స్టైల్లో సమాదానం ఇచ్చింది. నాలుగు రోజులు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా లేకపోతే మనిషిని కూడా చంపేసేలా ఉన్నారే అంటూ తన భర్త దీపక్‌తో ఉ‍న్న ఫోటోను షేర్‌ చేసి విడాకుల కామెంట్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

మరోకరు బుల్లితెర సీరియల్‌ నటి నవ్యతో విడిపోయారా..? అని అడగ్గా అందుకు హరితేజ అది అవదమ్మా.. అంటూ తమ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ఎంతో బలమైనదని చెప్పింది. అఆ, యూ ట‌ర్న్, అరవింద సమేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే వంటి సినిమాల్లో అదిరిపోయే తన నటనతో మెప్పించిన హరితేజకు మరొక మంచి పాత్ర పడితే మళ్లీ సినిమాల్లో బిజీ కావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. కానీ ఈమె అల్లరి, నటనకు ఎంతో మంది ఫిదా అవుతుంటారు. సింపుల్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ బలం గా తెలుగు ఇండస్ట్రీలో నాటుకొని పోయింది. తన టాలెంట్ తో ఎంతో మందిని ఆకట్టుకోవడమే కాదు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కూడా అందుకుంటుంది హరితే.

సీరియల్ లో కూడా ఫుల్ గా మెప్పించింది హరితేజ మరి ఆమె నటించిన సీరియల్స్ ఏంటో మీకు గుర్తున్నాయా? అంతకు ముందు మరో విషయమండీ.. హరితేజ కూచిపూడి డ్యాన్సర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. అలా మొదలైన ఈమె జర్నీ బుల్లితెరపైకి నటిగా అడుగు పెట్టి ‘మనసు మమత’ సీరియల్‌లో నటించి హైలైట్ అయింది. ఈ సీరియల్ చూసిన ఎంతో మందికి ఆమె కలల రాణి కూడా. యువతను ఈ సీరియల్ తో ఫుల్ గా ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘ముత్యమంత పసుపు’, ‘రక్త సంబంధం’, ‘అభిషేకం’, ‘తాళి కట్టు శుభవేళ’, ‘శివ రంజనీ’, ‘కన్యాదానం’ వంటి సీరియల్స్‌లో నటించింది.