Sridevi Soda Center Telugu Movie: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏముంది ?

Sridevi Soda Center Telugu Movie: హీరో సుధీర్ బాబు ( Sudheer Babu) సిక్స్ ప్యాక్ కోసం చాలా కష్టపడ్డాడు. అందుకే అవసరం లేకపోయినా “శ్రీదేవి సోడా సెంటర్” (Sridevi Soda Center) సినిమాలో చొక్కా విప్పడానికి బాగా ఆసక్తి చూపించాడు. ఎలాగూ దర్శకుడు కూడా చిన్నవాడే కాబట్టి, సుధీర్ బాబు చెప్పిందే ఫైనల్ అయింది. దాంతో చొక్కా ఎన్ని సార్లు ఎంతసేపు విప్పినా అడిగే వాడే లేకుండా పోయాడు. దాంతో మీడియా కూడా సినిమా […]

Written By: admin, Updated On : August 31, 2021 10:39 am
Follow us on

Sridevi Soda Center Telugu Movie: హీరో సుధీర్ బాబు ( Sudheer Babu) సిక్స్ ప్యాక్ కోసం చాలా కష్టపడ్డాడు. అందుకే అవసరం లేకపోయినా “శ్రీదేవి సోడా సెంటర్” (Sridevi Soda Center) సినిమాలో చొక్కా విప్పడానికి బాగా ఆసక్తి చూపించాడు. ఎలాగూ దర్శకుడు కూడా చిన్నవాడే కాబట్టి, సుధీర్ బాబు చెప్పిందే ఫైనల్ అయింది. దాంతో చొక్కా ఎన్ని సార్లు ఎంతసేపు విప్పినా అడిగే వాడే లేకుండా పోయాడు. దాంతో మీడియా కూడా సినిమా కంటే కూడా సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ గురించే ఎక్కువ మాట్లాడింది.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. సినిమా రిలీజ్ అయ్యాక, కలెక్షన్స్ చూస్తే గానీ సుధీర్ బాబుకు జరిగిన నష్టం అర్థం కాలేదు. అందుకే, తాజాగా సినిమా ప్రమోషన్ లో మీడియాను ఓ ప్రత్యేక కోరిక కోరాడు. ఏమిటి ఆ కోరిక అంటే.. ఇక నుండి తన బాడీ కంటే కూడా తన సినిమా గురించి, అలాగే తన నటన గురించి ఎక్కువగా కవరేజ్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాడు.

నిజంగా సుధీర్ బాబు ముందే మేల్కొని ‘శ్రీదేవి సోడా సెంటర్’ను ఇంకా బాగా జనం లోకి తీసుకెళ్లి ఉంటే బాగుండేది. కానీ ఈ సినిమా ఇప్పటికే అతి దారుణంగా పరాజయం పాలు అయింది. కాబట్టి, ఇక చేసేది ఏమి లేదు. ఒకసారి ప్లాప్ టాక్ వచ్చాక స్టార్ హీరో సినిమాకు కూడా కలెక్షన్స్ రావడం అనేది జరగదు. కాబట్టి.. మొత్తమ్మీద సుధీర్ బాబు ఖాతాలో మరో భారీ డిజాస్టర్ పడినట్టే.

అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. సినిమా ప్లాప్ అయినా, ఆ విషయాన్ని కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. సుధీర్ బాబు చొక్కా విప్పుడు కార్యక్రమం పైనే అందరి కామెంట్స్ ఉండటం విశేషం. పాపం సుధీర్ బాబు ఎంత కష్ట పడుతున్నా.. హిట్ మాత్రం రావడం లేదు. ఎంతో కష్టపడి సిక్స్ ప్యాక్ పెంచినా సుధీర్ బాబు కష్టాన్ని ఎవ్వరూ గుర్తించడం లేదు.

కనీసం రాబోయే సినిమాలతోనైనా సుధీర్ బాబుకు మంచి హిట్ రావాలని ఆశిద్దాం. అయితే, సినిమా ఆసాంతం బట్టలు విప్పి బాడీ చూపించడం లాంటివి చేయకుండా.. నటన విషయంలో తన టాలెంట్ ను చూపిస్తే బాగుంటుంది. అయినా కథకు అవసరం లేకపోయినా.. బాడీ చూపించేందుకు తహతహలాడితే చివరకు డిజాస్టర్లే వస్తాయి.