Sridevi- Chiranjeevi: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన కాంబినేషన్స్ లో ఒకటి మెగాస్టార్ చిరంజీవి – శ్రీదేవి కాంబినేషన్..1990 వ సంవత్సరం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో విడుదలైన ‘జగదేక వీరుడు – అతిలోక సుందరి’ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..ఈ సినిమా కి ముందు శ్రీదేవి కి ఉన్న డిమాండ్ మామూలుది కాదు..తెలుగులో ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడి స్టార్ హీరోలందరి తో కలిసి నటించి ఇండియన్ చలన చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది..ఆ సమయం లో మన తెలుగు డైరెక్టర్స్ కి ఈమె కాల్ షీట్స్ దొరకడం చాలా కష్టమైన పని..కానీ అశ్విని దత్ గారితో గతం లో శ్రీదేవి ఎన్నో సినిమాల్లో నటించింది..ఆయనతో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యు శ్రీదేవి ని టాప్ స్టార్ హీరోయిన్ గా నిలబెట్టింది..అంత పెద్ద మనిషి రిక్వెస్ట్ చెయ్యడం తో శ్రీదేవి కాదనకుండా డేట్స్ ఇచ్చేసింది..అందులోనూ తన పాత్ర ఎంతో అద్భుతంగా ఉండడం తో కథ వినగానే శ్రీదేవి మరోమారు ఆలోచించకుండా తానూ బాలీవుడ్ లో ఒప్పుకున్న సినిమాలను కూడా పక్కకి నెట్టి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కోసం డేట్స్ సర్దుబాటు చేసింది.
అలా K.రాఘవేంద్ర రావు దర్శకత్వం లో చిరంజీవి – శ్రీదేవి హీరో హీరోయిన్లు గా తెరకెక్కిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..ఈ సినిమా విడుదల సమయం లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వరదలు వ్యాపించాయి..అయినా కూడా ఈ సినిమా వసూళ్లకు ఏ మాత్రం అడ్డుకట్ట వెయ్యలేకపోయ్యాయి..ఎన్నో అడ్డంకులను విజయవంతంగా దాటుకొని ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..దీనితో శ్రీదేవి చిరంజీవి కాంబినేషన్ కి జనాల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది..పబ్లిక్ లో ఉన్న డిమాండ్ ని గమనించిన శ్రీదేవి చిరంజీవి తో నిర్మాతగా మారి కోదండ రామి రెడ్డి దర్శకత్వం లో ‘వజ్రాల దొంగ’ అనే సినిమాని నిర్మించాలి అనుకుంది.
Also Read: Rajinikanth- Jailer: ఈసారి రజినీకాంత్ ‘జైలర్’ అట!
తన సొంత చెల్లెలు లతా గారి పేరు మీద ‘లతా ప్రొడక్షన్స్’ బ్యానర్ ని స్థాపించి ఈ సినిమాని ఘనంగా ప్రారంభించింది..హిందీ లో సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా చలామణి అవుతున్న బప్పీలహరి చేత అద్భుతమైన పాటలను కూడా కంపోజ్ చేయించారు..ఈ పాటలకు అప్పట్లో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది..వైజాగ్ లో ఒక్క భారీ సెట్ వేసి చిరంజీవి – శ్రీదేవి మధ్య ఒక్క పాటని కూడా చిత్రీకరించారు..కానీ సినిమా కథ విషయం లో ఆ చిత్ర దర్శకుడు కోదండ రామి రెడ్డి కి ఎక్కడో తేడా కొట్టింది..ఈ సినిమాకి పెడుతున్న బడ్జెట్ కి ఈ కథ సరిపడదు అని శ్రీదేవి చెప్పి సినిమాని ఆపించేసాడు..క్రేజీ కాంబినేషన్ కావడం తో ఈ సినిమాకి అప్పటికే వివిధ ప్రాంతాల నుండి కళ్ళు చెదిరే బిజినెస్ ఆఫర్లు వచ్చాయి..కానీ కథ విషయం లో డైరెక్టర్ కి నమ్మకం లేకపోవడం తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం దశలోనే ఆగిపోయింది.
Also Read:Ante Sundaraniki Collections: అక్కడ హిట్ ఇక్కడ ఫట్… అంటే సుందరానికీ మిక్స్డ్ రిజల్ట్!