Homeఎంటర్టైన్మెంట్Samantha Instagram Income: ఇంస్టాగ్రామ్ ద్వారా సమంత నెలకి ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా?

Samantha Instagram Income: ఇంస్టాగ్రామ్ ద్వారా సమంత నెలకి ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా?

Samantha Instagram Income: సోషల్ మీడియా ద్వారా కూడా డబ్బులు ఒక రేంజ్ లో సంపాదించుకోవచ్చు అనే విషయం మన అందరికి తెలిసిందే..మనలాంటి సామాన్య మధ్య తరగతి కుటుంబాలలో ఉద్యోగాలు లేని వాళ్ళు సోషల్ మీడియా ని ఆసరాగా తీసుకొని వేలల్లో లక్షల్లో సంపాదిస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు..అయితే ఈ జాబితాలో సినీ తారలు కూడా ఉంటారనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు..ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో లైక్స్ మరియు వ్యూస్ ఒక రేంజ్ లో వచ్చే సినీ తారలకు లక్షల్లో డబ్బులు సంపాదించడం మనకి తెలిసిన విషయమే..అలాంటి సెలెబ్రెటీస్ లో ఇంస్టాగ్రామ్ నుండి అత్యధికంగా డబ్బులు సంపాదించే వారి లిస్ట్ లో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్న హీరోయిన్ సమంత..ఈమెకి సౌత్ ఇండియా లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇక ఇంస్టాగ్రామ్ లో అయితే ఈమెకి మిలియన్ల కొద్ది ఫాలోయర్స్ ఉన్నారు.

Samantha Instagram Income
Samantha

ఆమెకి సంబంధించిన ఏ పోస్టు పెట్టినా నిమిషాల వ్యవధిలో లక్షల కొద్ది లైక్స్ వస్తుంటాయి..సమంత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని వేదికగా చేసుకొని తనకి అనిపించిన కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది..అంతే కాకుండా తనకి సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ అభిమానులకు మతి పొయ్యేలా చేస్తుంది..ఈ ఫోటోలకు ఆమెకి లక్షల్లో లైక్స్ రావడం మనం గమనించొచ్చు.

Also Read: Sridevi- Chiranjeevi: శ్రీదేవి నిర్మాతగా.. చిరంజీవి హీరోగా నటించిన సినిమా ఏమిటో తెలుసా?

ఆ స్థాయి రీచ్ వచ్చే సెలెబ్రెటీలకు ఇంస్టాగ్రామ్ వాళ్ళు భారీ మొత్తం డాలర్స్ రూపం లో నెలకు డబ్బులిస్తారట..వీటితో పాటు కొన్ని బ్రాండింగ్ ప్రొడక్ట్స్ కి సంబంధించిన వాళ్ళు తమ ప్రొడక్ట్స్ కి మార్కెటింగ్ పెంచుకోవడం కోసం సమంత ని ప్రమోట్ చెయ్యమని భారీ స్థాయిలో ఆఫర్లు వస్తాయట..కేవలం ఈ ప్రకటనల ద్వారానే ఆమె నెలకి 3 కోట్ల రూపాయిలు సంపాదిస్తుందట..కేవలం ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి నెలకి మూడు కోట్ల రూపాయిలు సంపాదించడం అంటే మాములు విషయం కాదు.

Samantha Instagram Income
Samantha

సమంత ఒక్కో సినిమాకి గాను పారితోషికంగా నాలుగు నుండి 5 కోట్ల రూపాయిల వరుకు తీసుకుంటుంది..ఒక్క సినిమా పూర్తి అవ్వడానికి దాదాపుగా ఆరు నెలల సమయం పడుతుంది..ఆమె ఆరు నెలలు కష్టపడితే కానీ రాని డబ్బులు..ఏ మాత్రం కష్టపడకుండా కేవలం ఇంస్టాగ్రామ్ నుండి నెలకు 3 కోట్ల రూపాయిలు సంపాదిస్తుంది..సినిమాల్లో వచ్చే డబ్బులకంటే సోషల్ మీడియా ద్వారా సెలెబ్రిటీలు ఎలా సంపాదిస్తున్నారో చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ గా తీసుకోవచ్చు..ప్రస్తుతం సమంత శాకుంతలం మరియు యశోద అనే రెండు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తుంది..వీటితో పాటు విజయ్ దేవరకొండ తో ‘ఖుషి’ అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది..ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది సమంత.

Also Read:Rajinikanth- Jailer: ఈసారి రజినీకాంత్ ‘జైలర్’ అట!

Samantha ఇంస్టాగ్రామ్  సంపాదన || Samantha Instagram Earnings || Oktelugu Entertainment

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version