Rajinikanth- Jailer: పాలిటిక్స్ లోకి వస్తానంటూ చెప్పి అనూహ్యంగా వెనకడుగు వేశాడు రజనీకాంత్. దేవుని ఆదేశం, ఆరోగ్య సమస్యల కారణంగా ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రజినీ నిర్ణయం ఫ్యాన్స్ ని పూర్తి నిస్పృహ లోకి నెట్టింది. ఎలాగైనా నిర్ణయం వెనక్కి తీసుకునేలా చేయాలని ఫ్యాన్స్ గట్టిగానే పోరాడారు. రజినీ ఇంటి ముందు రోజుల తరబడి నిరసనలు తెలిపారు. ఆయన మాత్రం నిర్ణయం మార్చుకోలేదు. ఇక రాజకీయాల్లోకి వచ్చేది లేదని తేల్చిపారేశారు. అయితే తుది శ్వాస వరకు నటుడిగా ఉండాలని అనుకుంటున్నారు.
ఈ క్రమంలో ఆయన వరుసగా చిత్రాలు చేస్తున్నారు. రజినీకాంత్ గత చిత్రం అన్నాత్తే. దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ మూవీ తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగులో పెద్దన్న టైటిల్ తో విడుదలైన ఈ చిత్రం ఏమంత ప్రభావం చూపలేదు. పెద్దన్న చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు. ఇక రజినీ తన 169వ చిత్రం దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో ప్రకటించారు. డాక్టర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దిలీప్ కుమార్, విజయ్ తో బీస్ట్ వంటి భారీ మూవీకి దర్శకత్వం వహించారు.
Also Read: Ante Sundaraniki Collections: అక్కడ హిట్ ఇక్కడ ఫట్… అంటే సుందరానికీ మిక్స్డ్ రిజల్ట్!
అయితే బీస్ట్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. బీస్ట్ విడుదలకు ముందే రజినీకాంత్ తో దిలీప్ కుమార్ మూవీ ప్రకటించారు. నేడు ఈ చిత్ర టైటిల్ ప్రకటించారు. ఆసక్తికరంగా రజినీకాంత్ 169వ చిత్రానికి ‘జైలర్’ అనే టైటిల్ నిర్ణయించారు. ఇక టైటిల్ చూస్తుంటే రజినీకాంత్ జైలర్ గా కనిపిస్తారని అర్థమవుతుంది. కెరీర్ లో మొదటిసారి రజినీకాంత్ ఈ రోల్ చేయడం విశేషం. టైటిల్ ప్రకటనతోనే మూవీపై అంచనాలు పెంచారు. ఇక రజినీకాంత్ ఇమేజ్ కి తగ్గట్లు అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కే అవకాశం కలదు.
జైలర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలో మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. జైలర్ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read:Virata Parvam Collections: విరాట పర్వం మొదటి రోజు వసూళ్లు..ఎవ్వరు ఊహించని అద్భుతం ఇది