Rajinikanth : అతిలోక సుందరి శ్రీదేవి లాంటి హీరోయిన్ పక్కన నటించాలని ఏ హీరోకి మాత్రం ఉండదు చెప్పండి?. నేటి తరం స్టార్ హీరోలకు కూడా ఆమె మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్. ఆరోజుల్లో ఆమె అన్నీ భాషల్లోనూ దాదాపుగా అందరి హీరోలతో కలిసి ఆడిపాడింది. మన తెలుగు లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరి స్టార్ హీరోలతో సినిమాలు చేసేసింది. అలాగే తమిళం లో కూడా రజినీకాంత్, కమల్ హాసన్ లతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కలిసి నటించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో అయితే ఆమె ఏకంగా 20 సినిమాల్లో నటించింది. అందులో రజినీకాంత్ కొన్ని సినిమాల్లో హీరోగా చెయ్యగా, కొన్ని సినిమాల్లో విలన్ గా నటించాడు.
ఇది కాసేపు పక్కన పెడితే రజినీకాంత్ కి శ్రీదేవి యవ్వనపు వయస్సులో ఉన్న రోజుల్లోనే ఒక సినిమాలో ఆయనకీ సవతి తల్లి పాత్ర పోషించింది అనే విషయం ఎవరికైనా తెలుసా?..అవును!, మీరు వింటున్నది నిజమే. ఆ చిత్రం పేరు ‘మూండ్రు ముడిచ్చు’. ఈ చిత్రం లో హీరోయిన్ కూడా శ్రీదేవినే, అలాగే రజినీకాంత్ కి తల్లి గా కూడా ఆమె ద్విపాత్రాభినయం చేసింది. కథలో వచ్చే ఈ కీలక ట్విస్ట్ వల్లే ఆ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా నటించాడు. అలా ఒక నటి ఒక స్టార్ హీరో సరసన హీరోయిన్ గా చెయ్యడం, అదే స్టార్ హీరో కి ఆమె తల్లిగా నటించడం, ఈ రెండు కూడా ఒకే సినిమాలో జరగడం ఇదే తొలిసారి అట. గతం లో శ్రీదేవి సూపర్ స్టార్ కృష్ణ, ఏఎన్నార్ మరియు ఎన్టీఆర్ వంటి సూపర్ స్టార్స్ సినిమాల్లో కూతురుగా నటించింది. మళ్ళీ ఆమెనే పెద్దయ్యాక వారికి హీరోయిన్ గా చేసింది. కానీ రజినీకాంత్ విషయం లో మాత్రం ఒకే సినిమాలో ఇలాంటి వింత ప్రయోగం జరిగింది. ఇకపోతే సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జ్ఞాన్ వేల్ రాజా దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దగ్గుపాటి రానా వంటి నటులు కూడా ఉన్నారు. అలాగే ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో ఆయన ‘కూలీ’ అనే చిత్రం చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. అతి త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్లనుంది. 7 పదుల వయస్సులో కూడా రజినీకాంత్ నేటి తరం సూపర్ స్టార్స్ తో సరిసమానమైన బాక్స్ ఆఫీస్ వసూళ్లను రాబడుతూ సంచలనం సృష్టిస్తున్నారు. ఆయన హీరో గా నటించిన ‘జైలర్’ చిత్రం 650 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన సంగతి అందరికీ తెలిసిందే. లోకేష్ తో తీస్తున్న మూవీ సూపర్ హిట్ అయితే వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని కూడా సూపర్ స్టార్ అందుకుంటాడని అంటున్నారు ట్రేడ్ పండితులు.