https://oktelugu.com/

Venu Swamy : సెలబ్రిటీలను టార్గెట్ చేసి కామెంట్స్ చేసిన వేణు స్వామికి ఉచ్చు బిగుస్తుందా…. అసలేం జరిగింది..?

ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో మంచి కంటే చెడు ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. నిజానికి ఒకప్పుడు జనాలు ఎంతో కొంత పక్క వాళ్ళకి సాయం చేయాలనుకునేవారు. కానీ ఈ రోజుల్లో మాత్రం పక్క వాడిని ఎలా నాశనం చేయాలని చూస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 12, 2024 / 08:43 PM IST

    Venu Swamy

    Follow us on

    Venu Swamy :  ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో సోషల్ మీడియా అనేది విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఇంటర్నెట్ అనేది అందరికీ అందుబాటులోకి రావడంతో సిటి లో ఉండే వ్యక్తుల నుంచి మారు మూలా విలేజిల్లో ఉండే వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరూ ఫోన్లను ఎక్కువగా వాడుతూ సోషల్ మీడియా ద్వారా చాలా మంది ఫేమస్ అవుతున్నారు. ఇక ఇలా ఫేమస్ అయిన వాళ్లలో కొంత మంది సినిమాల్లో కూడా అవకాశాలను దక్కించుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాని మంచి కోసం వాడుకుంటే తప్పులేదు. కానీ ఇతరుల జీవితాలను ఇబ్బంది పెడుతూ ఇతర వ్యక్తులకు భంగం కలిగించే విధంగా మాట్లాడడం లాంటివి చేయడం అనేది చాలా వరకు తప్పు… ఇక వేణు స్వామి అనే వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో సెలబ్రిటీల జాతకాలను చెబుతూ ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా నాగచైతన్య సమంత లు విడిపోతున్నారు అంటూ ఆయన అప్పట్లో చేసిన కామెంట్లు చాలా వైరల్ అయ్యాయి. దాంతో పాటు ఇద్దరి మధ్య కూడా గొడవలు వచ్చి విడిపోవడంతో ఆయన దానిని ఎక్కువగా ప్రచారం చేసుకుంటూ జ్యోతిష్యం చెప్పడంలో ఆయనే దిట్ట అనేలా పేరు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ రీసెంట్ గా జరిగిన ఎలక్షన్లలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

    అలాగే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని కామెంట్లు చేయడంతో ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఓడిపోయి రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడటంతో ఆయనను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ దెబ్బకి నేను ఇంకొకసారి పబ్లిక్ గా జాతకాలు చెప్పను అని నిర్ణయం తీసుకున్న వేణు స్వామి రీసెంట్ గా నాగచైతన్య, శోభిత ధూళి పాళ ఎంగేజ్ మెంట్ అయిన రోజే పథకాలను చూసి వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్ చేశాడు.

    సమంత జాతకం శోభిత ధూళి పాళ జాతకం ఒకటేనని చెప్పి నాగచైతన్య శోభితా ఇద్దరూ 2027 వరకు ఏ గొడవలు లేకుండా కలిసి ఉంటారని ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేమంటూ
    సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు వేణు స్వామి మీద జనాలందరూ ఫైర్ అవుతున్నారు. వాళ్ల పాటికి వాళ్ళు పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలని చూస్తుంటే నువ్వేంటి అయ్యా వాళ్ల చెడు కోరుతున్నావ్ అంటూ కామెంట్లు చేశారు.

    ఇక తెలుగు ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ మరియు తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ కలిసి వేణు స్వామి తరుచుగా సినీ సెలెబ్రెటీల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటూ ఆయన మీద చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ అయిన నీరెళ్ళ శారద గారికి ఫిర్యాదు చేశారు… ఇక దీనిపైన స్పందించిన శ్రీమతి నీరెళ్ళ శారద గారు వేణు స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అతనిపైన అలాగే ఆయన ఆ వీడియోను పోస్ట్ చేసిన ఛానల్ పైన తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు…