Tollywood : ఆ డైరెక్టర్ కి టాలీవుడ్, బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేశాయి. మీరు పైన చూస్తున్న ఆ ఫోటో ఆయన కాలేజ్ లో చదువుతున్న రోజుల్లో క్లాస్ మేట్స్ తో దిగింది. ఈ ఫొటోలో ఓ క్రేజీ డైరెక్టర్ ఉన్నాడు. అది ఎవరో? ఎక్కడ ఉన్నాడో కనిపెట్టండి? అంటూ నెటిజన్లు ఈ పిక్ వైరల్ చేస్తున్నారు.
ఆయన మరెవరో కాదు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాఫియా, హారర్, యాక్షన్ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు. ఆర్జీవీ డైరెక్ట్ చేసిన శివ, మనీ మనీ, క్షణ క్షణం, గులాబీ, రంగీలా, ప్రేమ కథ వంటి చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి. బెస్ట్ డైరెక్టర్ గా ఎన్నో అవార్డులు అందుకున్నారు. వర్మ తెలుగులోనే కాదు హిందీ లో కూడా సూపర్ హిట్ సినిమాలు తీశాడు.
అలాగే రామ్ గోపాల్ వర్మ ప్రొడ్యూసర్ కూడా పలు సినిమాలు నిర్మించాడు. 90లలో ఆయన తిరుగులేని దర్శకుడు. ఆర్జీవీ సినిమా అంటే అప్పట్లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కువగా కాంట్రవర్షియల్ సినిమాలు తీస్తున్నాడు. రాజకీయపరమైన, రొమాంటిక్ కథలు రూపొందిస్తున్నారు. వర్మ సినిమా అంటే ఓ మార్క్ ఉండేది. ప్రస్తుతం ఆయన సినిమాలు విడుదల అవుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు.
ఆర్జీవీ నుంచి మంచి సినిమా వచ్చి చాలా కాలం అయిపోయింది. సోషల్ మీడియాలో వర్మ ట్వీట్లు, చేసే కామెంట్లు ఎంత వైరల్ అవుతాయో చెప్పక్కర్లేదు. ఏ విషయం గురించైనా ఆర్జీవీ తన స్టైల్లో స్పందిస్తుంటాడు. తనకు నచ్చిన విధంగా మాట్లాడుతూ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంటాడు. నెట్టింట ఆర్జీవీ హంగామా మామూలుగా ఉండదు. హాట్ బ్యూటీలతో ఇంటర్వ్యూలు, పార్టీలు అంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటాడు. వాటికి నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తుంటారు.
ఇటీవల ఓ మలయాళ బ్యూటీ అందానికి ఫిదా అయ్యాడు ఆర్జీవీ. ఆ అమ్మాయి ఎవరు అని నెటిజన్లను అడిగి వెతికి పట్టుకున్నాడు. ఆమె పేరు ఆరాధ్య దేవి. ఆమెను హీరోయిన్ గా పెట్టి శారీ అనే సినిమా తీస్తున్నాడు. ఇక ఇటీవల కల్కి ఏడీ 2898 మూవీలో ఆర్జీవీ క్యామియో రోల్ లో కనిపించి సర్ప్రైజ్ చేశారు.
ఇక రామ్ గోపాల్ వర్మ ఫిలాసపీ ఎవరు పాటించలేనిది. ఎవరైనా సమాజం కోసం బ్రతుకుతారు. వర్మ మాత్రం తన కోసమే బ్రతుకుతాడు. మందు తాగుతానని, శృంగారం ఆస్వాదిస్తానని ఓపెన్ గా చెబుతాడు. దేవుడిని నమ్మడు. వర్మ లైఫ్ స్టైల్ ని ఇష్టపడేవారు లేకపోలేదు. వర్మలా బ్రతకాలని అందరికీ ఉంటుంది. కుటుంబ సభ్యులు, సమాజం ఏమనుకుంటుందో అని భయపడతారు. జీవించినంత కాలం హ్యాపీగా బ్రతకడమే అంటారు. కుటుంబ సభ్యుల పట్ల కూడా వర్మ గట్టి అఫెక్షన్ కలిగి లేరు.