Sridevi Drama Company Effect: ‘నువ్వా దరిని.. నేనీ దరిని.. కృష్ణమ్మ చేర్చింది ఇద్దరినీ’ అన్నారో సినీకవి. ఒక్కోసారి మనం జీవితంలో ఎన్నటికి చూడలేమనుకున్నవి.. కలవలేమనుకున్నవి కూడా మనకు అందుబాటులోకి రావడం సహజమే. ఇక్కడో కూతురు తల్లిదండ్రుల చెంతకు చేరిన వైనం ఆశ్చర్యం కలిగిస్తోంది. మూడున్నర సంవత్సరాల వయసులో 2014 సెప్టెంబర్ 3న తప్పిపోయి చివరకు తల్లిదండ్రుల చెంతకు చేరడం నిజంగా అదృష్టమే. తమ కూతురు తప్పిపోయిందని వారు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినా ఆచూకీ లభించలేదు. దీంతో వారి కోరిక ఎట్టకేలకు నెరవేరింది. తమ కన్న కూతురును చూసిన ఆనందం చెప్పలేనిది.

ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో అనాథ పిల్లల స్కిట్ చూసిన ఓ తల్లి తన బిడ్డ టీవీలో కనిపించేసరికి ఆశ్చర్యపోయింది. తండ్రుల దినోత్సవం సందర్భంగా కొందరు అనాథ ఆడపిల్లలతో ఓ స్కిట్ చేశారు. అందులో ఓ పాపను చూసిన తల్లి ఆమె తన బిడ్డే అని ఆరా తీసిది. కిస్మత్ పురలోని ఓ అనాథాశ్రమంలో ఉంటుందని తెలుసుకున్న తల్లి ఆమెను చేరింది. ఆమె తన కూతురే అని నిర్ధారించుకుని అధికారులు, పోలీసుల సాయంతో పాపను తన ఒడికి చేర్చుకుంది.
హైదరాబాద్ లోని బాలల హక్కుల పరిరక్షణ కార్యాలయంలో అనాథగా ఇన్నాళ్లు జీవించిన అనురాధను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ సమయంలో వారు ఉద్వేగానికి లోనయ్యారు. ఎనిమిదేళ్లుగా తమ కూతురు కనబడకుండా పోయేసరికి దుఖం ఆపుకోలేకపోయామని.. ఇప్పుడు ఆనందానికి అవధులు లేవని తల్లిదండ్రులు ఆనందపడ్డారు. తమకు నలుగురు ఆడపిల్లలైనా కూతురు తప్పిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించామన్నారు.

ఎట్టకేలకు ఆమె తల్లిదండ్రుల చెంతకు చేరడంతో కథ సుఖాంతమైంది. ఒక్కోసారి కొన్ని విషయాల్లో మనకు అదృష్టం తలుపు తట్టడం చూస్తుంటాం. వీరి విషయంలో ఇప్పుడు ఇదే నిజమైంది. మొత్తానికి శ్రీదేవి డ్రామా కంపెనీ ఓ బాలికను తమ తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. వారు చేసిన ఓ కార్యక్రమం రెండు హృదయాల్లో వెలుగులు నింపింది. ఇన్నాళ్లు తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా అనాథగా ఆశ్రమంలో పడి ఉన్న బాలికకు తనవారున్నారనే దీమా కలిగించిన ఈటీవీ యాజమాన్యానికి వారు ధన్యవాదాలు తెలిపారు. తమ జీవితంలో వెలుగులు ప్రసరించేలా చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని ఉద్వేగంతో చెప్పుకొచ్చారు. అచ్చం సినిమా సన్నివేశంలా మారిన ఈ సీన్ శ్రీదేవి డ్రామా కంపెనీకి మంచి పేరు తీసుకొచ్చింది.
Also Read:Megastar Chiranjeevi: మెగాస్టార్ తో క్రేజీ కాంబినేషన్స్.. లిస్ట్ చూస్తే షేకే
[…] […]