30 Years Prudhvi: 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ టాలీవుడ్ లో ఫేమస్ అయిన కమెడియన్ సినిమాల్లో బాగానే కామెడీ చేస్తున్నా.. బయట మాత్రం బాగా వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడ్డారు. రాజకీయాల్లోకి వెళ్లి నోరుపారేసుకొని.. అనంతరం వైసీపీ అండగా ఎస్వీబీసీ చైర్మన్ గా చేరి.. అక్కడ లైంగిక ఆరోపణలతో పదవిని కోల్పోయారు.

ఇప్పుడు మళ్లీ సినిమాల్లో యాక్టివ్ గా మారారు. అయితే సినిమాల్లో ఎంత పాపులర్ అయినా కూడా వ్యక్తిగత జీవితంలో ఫృథ్వీ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. తన కుటుంబ విషయాలను తాజాగా బయటపెట్టాడు. తన పర్సనల్ లైఫ్ లో కూడా కొన్ని గొడవలు ఉన్నాయని తాజా ఇంటర్వ్యూలో బయటపడ్డాడు. తన ఫ్యామిలీ లైఫ్ బాగాలేదని ఓపెన్ అయ్యాడు.
దాదాపు 8 ఏళ్లుగా నా కుటుంబానికి దూరంగానే ఉంటున్నానని ఫృథ్వీరాజ్ బాంబు పేల్చారు. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులంతా విజయవాడలో ఉంటున్నారని.. తాను మాత్రం హైదరాబాద్ లోనే ఉంటున్నాని సంచలన విషయాన్ని ఫృథ్వీరాజ్ బయటపెట్టారు. అయితే తన పిల్లలంతా బాగానే సెటిల్ అయ్యారని.. వారికి చాలా దూరంగానే దూరంగానే ఉన్నా అని సంచలన విషయాన్ని ఫృథ్వీరాజ్ పంచుకున్నారు.
తాను చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఒక మహిళతో పరిచయం ఉందని.. ఆమె వరంగల్ లో కొన్నాళ్లు ఉండి ఆ తర్వాత హైదరాబాద్ లో సెటిల్ అయ్యారని చెప్పారు. ఆమె పేరు ‘దాసరి పద్మరేఖ’అంటూ సంచలన విషయాన్ని పంచుకున్నారు. ఆమె తనకు ఎలాంటి కష్టం వచ్చినా కూడా సహాయం చేసిందని వివరించారు. ప్రస్తుతం తాను ఆమెతోనే ఉంటున్నట్టు బయటపెట్టారు.
ఇక తన భార్యతో ఫ్యామిలీ కేసులు, గొడవలు ఇంకా జరుగుతున్నాయని.. ఇంకా తన భార్యతో విడాకులు కాలేదని ఫృథ్వీరాజ్ వ్యక్తిగత జీవితంలోని రహస్యాలను బయటపెట్టారు. తాను ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా తనకు అండగా నిలిచింది ఎవరంటే దాసరి పద్మ అంటూ తన ఎఫైర్ గురించి ఫృథ్వీరాజ్ ఓపెన్ అయ్యారు.
[…] […]