https://oktelugu.com/

టాలీవుడ్ పై ఉమ్మేస్తున్నారంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు?

వివాదాల ద్వారా, వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు శ్రీరెడ్డి సుపరిచితం. క్యాస్టింగ్ కౌచ్ తో రచ్చ చేసి గుర్తింపు తెచ్చుకున్న శ్రీరెడ్డి టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులపై చేసిన ఆరోపణలు అన్నీఇన్నీ కావు. ఏ విషయం గురించైనా బోల్డ్ గా మాట్లాడే శ్రీరెడ్డిపై ప్రజల్లో సైతం భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతూ ఉంటాయి. సినిమా సెలబ్రిటీల్లో కొందరు ఆమెను సమర్థిస్తే కొందరు మాత్రం ఆమెను తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఉంటారు. Also Read : బిగ్ బాస్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 30, 2020 / 10:01 AM IST
    Follow us on

    వివాదాల ద్వారా, వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు శ్రీరెడ్డి సుపరిచితం. క్యాస్టింగ్ కౌచ్ తో రచ్చ చేసి గుర్తింపు తెచ్చుకున్న శ్రీరెడ్డి టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులపై చేసిన ఆరోపణలు అన్నీఇన్నీ కావు. ఏ విషయం గురించైనా బోల్డ్ గా మాట్లాడే శ్రీరెడ్డిపై ప్రజల్లో సైతం భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతూ ఉంటాయి. సినిమా సెలబ్రిటీల్లో కొందరు ఆమెను సమర్థిస్తే కొందరు మాత్రం ఆమెను తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఉంటారు.

    Also Read : బిగ్ బాస్ పై దేవి నాగవల్లి సంచలన ఆరోపణలు !

    గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి తాజాగా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ నుంచి చెన్నైకు మకాం మార్చిన శ్రీరెడ్డి ఎస్పీ బాలు మృతి గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీపై వివాదాస్పద కామెంట్లు చేశారు. బాలు మరణంపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. చెన్నైలో ఎస్పీ బాలు అంత్యక్రియలకు హాజరైన శ్రీరెడ్డి టాలీవుడ్ హీరోలు అంత్యక్రియలకు రాకపోవడంపై మండిపడింది.

    తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎస్పీ బాలు అంత్యక్రియలకు ఒక్కరు కూడా రాకపోవడం ఏమిటని ప్రశ్నించింది. టాలీవుడ్ సెలబ్రిటీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన శ్రీరెడ్డి దొంగ నాటకాలు, దొంగ ఏడుపులు కట్టిపెట్టాలంటూ సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎవరూ హాజరు కాకపోవడంతో టాలీవుడ్ నటిగా తన పరువు పోయిందని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.

    బాలు వాయిస్ లేకపోతే మెగాస్టార్ లు లేరంటూ… టాలీవుడ్ ఇండస్ట్రీ నీచమైన ఇండస్ట్రీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మెగాస్టార్ ను టార్గెట్ చేస్తూ కెరీర్ ను నిలబెట్టిన వారి అంత్యక్రియలకు వెళ్లలేరా…? అని ప్రశ్నించింది. శ్రీరెడ్డి వ్యాఖ్యలపై టాలీవుడ్ నటులు ఏమని స్పందిస్తారో చూడాల్సి ఉంది.

    Also Read : ‘మోస‌గాళ్లు’ స్కామ్ బ‌య‌ట‌పెట్ట‌నున్న అల్లు అర్జున్‌!