కాస్టింగ్ కౌచ్ వివాదంతో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి.. అప్పటి నుంచి రచ్చ చేస్తూనే ఉంది. తరచూ సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫొటోలను షేర్‌చేస్తూ.. కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది. తాజాగా.. ఓ ఫొటోను షేర్ చేసిన శ్రీరెడ్డి.. మరోసారి పోరగాళ్లను రెచ్చగొట్టే పని మొదలు పెట్టింది. అది కూడా ఏకంగా.. బాత్ టబ్ లో కూర్చున్న ఫొటో షేర్ చేయడం విశేషం.
తనకు నచ్చని విషయాలపై, నచ్చని మనుషులపై డైరెక్ట్ గా అటాక్ చేసే శ్రీరెడ్డి.. తన అందాలను కూడా డైరెక్ట్ గా ప్రదర్శిస్తూ ఉంటుంది. అంగాంగ ప్రదర్శనకు సైతం ఏమాత్రం మొహమాట పడదు ఈ సుందరి. సోషల్ మీడియాతోపాటు ఇంటర్వ్యూల్లోనూ బోల్డ్ గా మాట్లాడేస్తూ.. తనకు ఎదురే లేదన్నట్టుగా సాగిపోతూ ఉంటుంది.
లేటెస్ట్ గా పోస్ట్ చేసిన పిక్ సెగలు పుట్టిస్తోంది. బాత్ రూమ్ లో.. బాత్ టబ్ లో దిగి జలకాలాడుతున్న ఫొటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఇందులో అమ్మడి లుక్ చూస్తే మతిపోవడం ఖాయం. లోదుస్తులతో బాత్ టబ్ లో కూర్చున్న శ్రీరెడ్డి.. ఏదో డ్రింక్ తాగుతోంది.
అంతేకాదు.. కొంటె చూపులతో నెటిజన్లను కవ్విస్తోంది. తడిచిన గులాబీ రేకులను గుండెలపై ఉంచుకొని.. ఎద అందాలను విచ్చలవిడిగా ప్రదర్శిస్తోంది. ఈ హాట్ ఫొటో చూసి జనాలు కళ్లు పెద్దవి చేస్తున్నారు. దీనికి కొందరు వావ్ సూపర్ అంటూ కామెంట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం బాత్ రూమ్ కూ జనాన్ని పిలవాలా శ్రీరెడ్డీ? అని ప్రశ్నిస్తున్నారు.