https://oktelugu.com/

ప్చ్.. రీల్ పై వీరత్వం, రియల్ గా కుళ్ళుబోతు తనం !

‘వినేవాడు చెప్పేవాడికి లోకువ’ అనే సామెతకి మన తెలుగు స్టార్ హీరోలు పుష్కలంగా సంపూర్ణంగా పరిపూర్ణంగా న్యాయం చేస్తున్నారు. అయినా ఎదుటి మనిషికి నీతులు చెప్పడంలో మన స్టార్ హీరోలూ ఎప్పుడూ ముందే ఉంటారు. ఇక తెలివి తేటల విషయంలో కూడా మన హీరోలను మించిన వారు లేరని సదరు హీరోలు ఫీల్ అవుతూ ఉంటారు. అయినా, వెండితెర పైన బీభత్సమైన మంచితనాన్ని చూపించే హీరోలు, బయట ఎలా ఉంటారో వారిని దగ్గరగా గమనించినవారికే తెలుస్తోంది. రీల్ […]

Written By:
  • admin
  • , Updated On : May 6, 2021 / 03:39 PM IST
    Follow us on


    ‘వినేవాడు చెప్పేవాడికి లోకువ’ అనే సామెతకి మన తెలుగు స్టార్ హీరోలు పుష్కలంగా సంపూర్ణంగా పరిపూర్ణంగా న్యాయం చేస్తున్నారు. అయినా ఎదుటి మనిషికి నీతులు చెప్పడంలో మన స్టార్ హీరోలూ ఎప్పుడూ ముందే ఉంటారు. ఇక తెలివి తేటల విషయంలో కూడా మన హీరోలను మించిన వారు లేరని సదరు హీరోలు ఫీల్ అవుతూ ఉంటారు.

    అయినా, వెండితెర పైన బీభత్సమైన మంచితనాన్ని చూపించే హీరోలు, బయట ఎలా ఉంటారో వారిని దగ్గరగా గమనించినవారికే తెలుస్తోంది. రీల్ లైఫ్ లో హ్యుమానిటీని, వీరత్వాన్ని ప్రదర్శించే హీరోలు, రియల్ లైఫ్ లో కుళ్ళుబోతు తనాన్ని, అతి గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్నట్టు ఉండి హీరోల గురించి ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అంటే..

    కథల విషయంలో మన హీరోలు క్లాస్ లు పీకుతున్నారు. సినిమా కథల్లో హీరోకి గొప్ప వ్యక్తిత్వం ఉండాలి, అతనిలో గొప్ప పోరాటపటిమ ఉండాలి, అతనొక యోధుడు అయి ఉండాలి అంటూ అబ్బో… కథా రచయితలకు కథలు ఎలా రాయాలో మన హీరోలు పాఠాలు చెబుతున్నారు. హీరో అంటే, అచ్చం హీరోనే అనిపించాలని హీరోల అభిప్రాయం.

    సాధారణ జనానికి ఫలానా హీరో అంటే ఏమిటో అతని సినిమాలు చూసి తెలిసిపోవాలట. భారీ పారితోషికాలు తీసుకుని, తమ అభిప్రాయాలకు తమ ఫీలింగ్స్ కి తగ్గట్టు పాత్రలను, డైలాగ్స్ ను రాయించుకుని అడ్డమైన సినిమాలు తీసి, నిర్మాతలను ముంచిన హీరోలు టాలీవుడ్ లో ఎక్కువమందే ఉన్నారు కదా ? అయినా వీళ్లల్లో మార్పు రాదా ?

    ఇప్పటికే వీళ్ళ పై అనేక విమర్శలు గట్టిగా వినిపిస్తున్నా.. ఎన్నడూ తమ అభిప్రాయాలను ఇష్టాఇష్టాలను సినిమాల పై రుద్దడం మాత్రం ఈ హీరోలు మానడం లేదు. కథకు తగ్గట్టు తాము మారకుండా, తమకు తగ్గట్టు కథను మారుస్తూ నిర్మాతల జేబును గుల్ల చేస్తున్నారు.