
కులం పేరుతో ధూషించిన కేసులో తాడిపత్రి ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డ్రైవర్ సుబ్బారాయుడును కులం పేరుతో ధూషించాడని ఆయన తరుపున న్యాయవాది శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మరోవైపు జేసీ ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారంటూ పెద్దారెడ్డి ఇద్దరు కుమారులపై తాడిపత్రి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. తాడిపత్రిలో రెండు రోజుల కిందట పెద్దారెడ్డి, జేసీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తీవ్రంగా శ్రమించిన పోలీసులు 144 సెక్షన్ విధించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈక్రమంలో ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదైంది.