Anu Emmanuel- Allu Sirish: అల్లు శిరీష్-అను ఇమ్మానియేల్ ప్రేమించుకుంటున్నారంటూ భారీ ఎత్తున ప్రచారం జరిగింది. ఈ వార్తలు అల్లు అరవింద్ వరకూ వెళ్లాయి. ఊర్వశివో రాక్షసివో ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు శిరీష్ ఆ చిత్ర హీరోయిన్ గా చేసిన అను ఇమ్మానియేల్ గురించి మాట్లాడటానికి కూడా భయపడ్డారు. అను గురించి ఇంతకంటే ఏం మాట్లాడినా యూట్యూబర్స్ కి థంబ్ నెయిల్స్ ఇచ్చినవాడ్ని అవుతానని అన్నారు. ఇప్పటికే మేము లవర్స్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఆమెను నేను పొగిడితే మరిన్ని గాసిప్స్ పుట్టుకొచ్చే అవకాశం కలదన్న అర్థంలో శిరీష్ ఆ కామెంట్ చేయడం జరిగింది.

కాగా తాజాగా ఇంటర్వ్యూలో అను ఇమ్మానియేల్ ఈ విషయం పై నేరుగా స్పందించారు. శిరీష్ తో తనకున్న అనుబంధం ఎలాంటిదో స్పష్టత ఇచ్చారు. శిరీష్ తో నేను డేటింగ్ చేస్తున్నానన్న పుకార్లు నా వరకూ వచ్చాయి. మా అమ్మ నాకు చెప్పారు. ఆమె న్యూస్ బాగా చదువుతారు. నాపై వచ్చిన స్టోరీస్ ఆమె చదివి బాధపడ్డారు. నిజానికి నేను ఇలాంటి పుకార్లు పట్టించుకోను. కానీ అమ్మ బాధపడటంతో నాకు కూడా బాధేసింది. ఉర్వశివో రాక్షసివో చిత్రానికి ముందు శిరీష్ ని నేను కలవలేదు.
ఆ చిత్ర పూజా కార్యక్రమం రోజు మొదటిసారి కలిశాను. డైరెక్టర్ స్క్రిప్ట్ నేరేట్ చేశాక ఇద్దరం ఒకసారి కాఫీ షాప్ లో కలిశాము. మా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవడానికి , ఒకరి తత్త్వం మరొకరు అర్థం చేసుకోవడానికి మేము కలిశాము. శ్రీ కుమార్, సింధు పాత్రలను ఎలా చేయాలో మాట్లాడుకున్నాము. ఈ రోజుల్లో ఒక అమ్మాయి అబ్బాయి కాఫీ షాప్ లో కలిస్తే చాలు లవర్స్ అంటూ పుకార్లు పుట్టిస్తారు. ప్రేమకథా చిత్రాల్లో నటించే హీరో హీరోయిన్ ప్రేమలో పడ్డారని వార్తలు రాస్తారు.

శిరీష్ తో నాకు స్నేహం ఉంది. అయితే డి ప్రేమ కాదు. లవ్ చేసేంత చనువు, అఫెక్షన్ కూడా మా మధ్య లేదు. అల్లు అర్జున్ కి జంటగా నా పేరు సూర్య చిత్రం చేశాను. అప్పటి నుండి అల్లు అరవింద్ కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. అల్లు అరవింద్ గారు కూడా శిరీష్ తో ఎఫైర్ వార్తల గురించి నన్ను అడిగారు. నిరాధాధారమైన ఆ వార్తలకు ఇద్దరం నవ్వుకున్నాం కూడాను అని అను ఇమ్మానియేల్ చెప్పుకొచ్చింది. కాగా నేడు విడుదలైన ఉర్వశివో రాక్షసివో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కమర్షియల్ గా ఏ మేరకు ఆడుతుందో చూడాలి.