Homeఎంటర్టైన్మెంట్Sreemukhi : స్టార్ యాంకర్ శ్రీముఖి ఇలా అయిపోయిందేంటి? షాక్ లో ఫ్యాన్స్!

Sreemukhi : స్టార్ యాంకర్ శ్రీముఖి ఇలా అయిపోయిందేంటి? షాక్ లో ఫ్యాన్స్!

Sreemukhi : పటాస్ షోతో ఫేమ్ తెచ్చుకున్న శ్రీముఖి స్టార్ యాంకర్ గా ఎదిగింది. యాంకర్ సుమ షోలు తగ్గించడం, అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పడం, రష్మీ ఈటీవీకే పరిమితం కావడం శ్రీముఖికి కలిసొచ్చింది. తనదైన గ్లామర్ తో పాటు ఎనర్జీతో షోలను శ్రీముఖి రక్తి కట్టిస్తుంది. ప్రేక్షకులకు వినోదం పంచుతుంది. బుల్లితెరపై ప్రసారం అవుతున్న పాప్యులర్ షోలకు శ్రీముఖి యాంకర్ గా ఉంది. అడపాదడపా సినిమాలు కూడా చేసింది. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా కూడా చేయడం విశేషం. అలా ఒకటి రెండు చిత్రాల్లో లీడ్ రోల్స్ చేసింది.

Also Read : పొట్టి డ్రెస్ లో అదిరిన శ్రీముఖి.. ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే..

అయితే ఆమె యాంకరింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2, ఆదివారం స్టార్ మా విత్ పరివారం షోలకు శ్రీముఖి యాంకర్ గా ఉన్నారు. ఆదివారం స్టార్ మా విత్ పరివారం షోకి చాలా కాలంగా శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తోంది. తాజా ఎపిసోడ్ ప్రోమో బుల్లితెర ఆడియన్స్ తో పాటు ఆమె ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. అవినాష్, హరి, రోహిణితో శ్రీముఖి వినోదం పంచింది. ఈ క్రమంలో శ్రీముఖి ఫోటోలను స్క్రీన్ పై ప్రదర్శించారు. ఆ ఫోటోలు ఎవరివో పోల్చుకునేందుకు చాలా సమయం పట్టింది.

ఆ ఫొటోల్లో ఉంది శ్రీముఖి అని తెలిశాక అందరి మైండ్ బ్లాక్ అయ్యింది. కారణం ఆ ఫోటోల్లో శ్రీముఖి గుర్తు పట్టలేనంతగా ఉంది. కారణం అవి శ్రీముఖి టీనేజ్ ఫోటోలు. చిన్నప్పుడు శ్రీముఖి అలా ఉండేదా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శ్రీముఖి ఇలా ఉందేంటి అని చర్చ మొదలైంది. విషయం ఏమిటంటే టీనేజ్ లో శ్రీముఖి చాలా బొద్దుగా ఉండేది. ఆమె నటి కావాలనే తపనతో కష్టపడి బరువు తగ్గింది. అందంగా తన శరీరాన్ని మలుచుకుంది. నటిగా ప్రయత్నాలు చేసిన శ్రీముఖికి ఆఫర్లు రాలేదు. పైగా క్యాస్టింగ్ కౌచ్ వంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయట. అందుకే ఆమె యాంకరింగ్ వైపు అడుగులు వేసింది.

Also Read : టాలెంట్ చూపించిన శ్రీముఖి అమ్మానాన్న, నెటిజెన్ సెటైర్… తిరిగి ఇచ్చి పడేసిన క్రేజీ ఫాదర్! ఇంట్రెస్టింగ్ మేటర్

శ్రీముఖి స్టార్ యాంకర్ గా రాణిస్తుంది. ఆమె శరీర తత్వం రీత్యా సులభంగా బరువు పెరుగుతుంది. అందుకే రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ, డైట్ ఫాలో అవుతుంది. కెరీర్ కోసం శ్రీముఖి తనను తాను మార్చుకున్న తీరు అభినందనీయం. సోనాక్షి సిన్హా, సారా అలీ ఖాన్ సైతం ఊబకాయంతో బాధపడినవారే. కఠిన శ్రమతో వాళ్ళు అందమైన శరీరాకృతి సాధించారు.

Aadivaaram With StarMaa Parivaaram Promo | Sreemukhi Birthday Celebrations | Sun 11 AM | Star Maa

Exit mobile version