Vallabhaneni Vamsi: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కి( Vallabhaneni Vamsi Mohan ) బెయిల్ మంజూరు అయింది. విజయవాడలోని ఎస్సీ/ ఎస్ టి కోర్టు మంగళవారం వంశీకి బెయిల్ మంజూరు చేసింది. టిడిపి కార్యాలయంలో పనిచేస్తున్న సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ దక్కింది. ఆయనతోపాటు మరో నలుగురికి ఈ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే నెలల తరబడి రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ మోహన్. ఆయనపై కేసుల మీద కేసులు పెట్టారు. ఆ కేసుల్లో రిమాండ్ కొనసాగుతూ వచ్చింది. అయితే చాలావరకు కేసుల్లో బెయిల్ లభించినా.. టిడిపి కార్యాలయం పై జరిగిన దాడి కేసుకు సంబంధించి మాత్రం బెయిల్ రాలేదు. అయితే దీనిపై ఎట్టకేలకు కోర్టు సానుకూలంగా స్పందించింది. వల్లభనేని వంశీ మోహన్ కు బెయిల్ ఇచ్చింది.
Also Read: పాక్ తో యుద్ధం అదానీని అమాంతం పైకి లేపిందిగా..
* రెండేళ్ల కిందట దాడి..
2023లో గన్నవరంలో( Gannavaram) తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి జరిగింది. ఈ దాడి కేసుకు సంబంధించి 2025 ఫిబ్రవరి 13న హైదరాబాదులో.. వల్లభనేని వంశీ మోహన్ ను పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి కేసులో సాక్షిగా ఉన్న ముదునూరి సత్య వర్ధన్ అనే వ్యక్తిని వల్లభనేని వంశీ బెదిరించి.. కిడ్నాప్ చేసి తప్పుడు అఫిడవిట్ బాకలు చేయించాడని ఆరోపణలు వచ్చాయి. సత్య వర్ధన్ అయితే మొదట కోర్టులో తనకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పాడు. అటు తర్వాత పోలీసులను ఆశ్రయించి వల్లభనేని వంశీ తనను కిడ్నాప్ చేసి బెదిరించాడు అంటూ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగానే వల్లభనేని వంశీ పై కిడ్నాప్, బెదిరింపు, ఎస్సీ/ ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. అయితే సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ కేసులో వల్లభనేని వంశీ మోహన్ కు బెయిల్ లభించింది.
* మరో కేసులో రాని బెయిల్
అయితే సత్య వర్ధన్( satyavardhan ) కిడ్నాప్ నకు సంబంధించి వల్లభనేని వంశీ కి బెయిల్ వచ్చింది. కానీ టిడిపి కార్యాలయం పై దాడి కేసులో మాత్రం ఇంతవరకు బెయిల్ రాలేదు. ఇప్పటికే ఆరు కేసులు వల్లభనేని వంశీ పై నమోదయ్యాయి. అందులో ఐదు కేసులకు సంబంధించి బెయిల్ వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై భూ ఆక్రమణల కేసులు కూడా నమోదయ్యాయి. పలుమార్లు ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టులు కొట్టి వేశాయి. అయితే ఇప్పుడు చివరిగా టిడిపి కార్యాలయం పై దాడికి సంబంధించి కేసులో బెయిల్ రావాల్సి ఉంది. అంతవరకు ఆయన జైలులోనే గడపాల్సి ఉంది.సుమారు మూడు నెలలుగా రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు వల్లభనేని వంశీ మోహన్.
* ఆ దూకుడుకు మూల్యం..
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దూకుడుగా ఉండేవారు. 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన వంశీ మోహన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. ఆ సమయంలోనే చంద్రబాబుతో పాటు లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. అయితే ఎన్నికల ఫలితాలు అనంతరం పూర్తిగా సైలెంట్ అయ్యారు. విదేశాలకు వెళ్లిపోతారని కూడా ప్రచారం జరిగింది. కానీ టిడిపి కూటమి ప్రభుత్వం పాత కేసులను తిరగదోడింది. వరుసగా కేసులు నమోదు చేసింది. అయితే వల్లభనేని వంశీ కామెంట్స్ చూస్తే.. ఆయనపై కేసులు సహేతుకం అన్నవారు అధికం. అయితే ఈ కేసులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పు పడుతున్నాయి. ఇది ముమ్మాటికి రాజకీయ ప్రతీకార చర్యగా పేర్కొంటున్నాయి.