https://oktelugu.com/

Sreemukhi: బాత్రూంలో శ్రీముఖి సెల్ఫీ.. వైరల్ నెట్టింట్లో రచ్చ

Sreemukhi: బుల్లితెరపై యాంకర్ గా అదరగొట్టిన భామలు ఎందరో ఉన్నారు. కానీ వారిలో కొందరు మాత్రమే పాపులారిటీ సాధించారు. టీవీ షోల్లో రాములమ్మగా శ్రీముఖి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పంచ్ లు, ప్రాసలు వేసి నవ్విస్తూ ఉంటుంది. కొన్ని సినిమాల్లో కూడా మెరిసిన శ్రీముఖి ఇటీవల యూఎస్ టూర్ కు వెళ్లింది. ఆమె మొదటిసారిగా అమెరికాకు వెళ్లడంతో తన టూర్ విశేషాలను అభిమానులతో పంచుకుంది. టూర్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఆకట్టుకుంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : July 25, 2022 / 11:32 AM IST
    Follow us on

    Sreemukhi: బుల్లితెరపై యాంకర్ గా అదరగొట్టిన భామలు ఎందరో ఉన్నారు. కానీ వారిలో కొందరు మాత్రమే పాపులారిటీ సాధించారు. టీవీ షోల్లో రాములమ్మగా శ్రీముఖి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పంచ్ లు, ప్రాసలు వేసి నవ్విస్తూ ఉంటుంది. కొన్ని సినిమాల్లో కూడా మెరిసిన శ్రీముఖి ఇటీవల యూఎస్ టూర్ కు వెళ్లింది. ఆమె మొదటిసారిగా అమెరికాకు వెళ్లడంతో తన టూర్ విశేషాలను అభిమానులతో పంచుకుంది. టూర్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఆకట్టుకుంది. అయితే ఇక్కడ శ్రీముఖ ఒకటి చేయరాని పని చేసింది. అలా చేయడంపై అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు. ఇంతకు శ్రీముఖి ఏం చేసిందో చూద్దాం.

    Sreemukhi

    అమెరికాలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీముఖి ఫ్లైట్ ఎక్కింది. ఆమెతో పాటు సింగర్లు మంగ్లీ, సాకేత్, డ్యాన్స్ మాస్టర్ శేఖర్ లు కూడా ఉన్నారు. లైఫ్లో తొలిసారి విమానం ఎక్కానని చెబుతూ శ్రీముఖి తన జర్నీ విశేషాలను తెలిపింది. మొదటగా తాను ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నట్లు తెలిపింది. దీంతో తన జర్నీ రిచ్ గా కొనసాగుతుందని పేర్కొంది. తనతో జర్నీ చేసే సింగర్లు, డ్యాన్స్ మాస్టర్ ను పరిచయం చేసింది. ముందుగా హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లారు. అక్కడ ఫ్లైట్ చేంజ్ చేశారు. దుబాయ్ ఏయిర్ పోర్టులో రెస్ట్ తీసుకునే ఏరియా.. అక్కడి వాతావరణాన్ని ఫొటోలు తీసింది.

    Also Read: Anushka Shetty Marriage: పెళ్లి పీటలు ఎక్కబోతున్న స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి..పెళ్ళికొడుకు ఎవరో తెలుసా?

    ఎమిరేట్స్ విమానంలో అధునాతన సౌకర్యాలు ఉన్నాయని తెలిపింది. ఆ ఫ్లైట్ విశేషాల గురించి తెలిపింది.అయితే ఇదే సమయంలో ఫ్లైట్ లోని బాత్రూం కూడా అద్భుతంగా ఉందని తెలిపింది. ఈ క్రమంలో బాత్రూంలోకి వెళ్లి సెల్ఫీ తీసుకుంది శ్రీముఖి. బాత్రూం ఎంత రిచ్ గా ఉందో ఆ వీడియోలో పేర్కొంది. అయితే ఈ ఫొటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన శ్రీముఖి ‘బాత్రూంలో ఏంటి భయ్యా’ అంటూ తానే కామెంట్ పెట్టింది. దీంతో నెటిజన్లు ఈ పిక్ చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    Sreemukhi

    మొత్తానికి యూఎస్ లో దిగిన శ్రీముఖి అక్కడి ఫొటోలను కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అక్కడ ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె పక్కన నిలబడి సెల్పీ తీసుకుంది. ఆ తరువాత సింగర్ సాకేత్ ఓ వీడియోను తీశాడు. ఇదే సమయంలో ఆమెను చూపించాడు. వెంటనే శ్రీముఖి కలగజేసుకొని ‘ఓరేయ్ వెధవ.. నా బ్లాగ్ లో ఆవిడి అప్పియరెన్స్ ఏంటిరా..’ అని అంటోంది. ప్రస్తుతం శ్రీముఖికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

    Also Read:Chiranjeevi- Murali Mohan: చిరంజీవి పై విష ప్ర‌యోగం నిజమే.. ముర‌ళీమోహ‌న్ షాకింగ్ కామెంట్స్

    Tags