Shah Rukh Khan: హైదరాబాద్ టోలీ చౌక్ లో నాలుగేళ్లు ఉన్న ఆ స్టార్ హీరో.. కారణమిదే

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. ఖాన్ త్రయంలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లలో ముఖ్యుడు. చలనచిత్ర సీమకే మకుటం లేని మహారాజు. షారుఖ్ కోసం ప్రాణాలైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉండే అభిమానులుండటం విశేషం. అంతటి సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న షారుఖ్ ఖాన్ సినిమాలంటే అందరికి పిచ్చే. విడుదల రోజే చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అంతటి విలువ సంపాదించుకున్న నటుడు షారుఖ్ ఖాన్. అతడికి హైదరాబాద్ తో ఉన్న […]

Written By: Srinivas, Updated On : July 25, 2022 11:44 am
Follow us on

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. ఖాన్ త్రయంలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లలో ముఖ్యుడు. చలనచిత్ర సీమకే మకుటం లేని మహారాజు. షారుఖ్ కోసం ప్రాణాలైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉండే అభిమానులుండటం విశేషం. అంతటి సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న షారుఖ్ ఖాన్ సినిమాలంటే అందరికి పిచ్చే. విడుదల రోజే చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అంతటి విలువ సంపాదించుకున్న నటుడు షారుఖ్ ఖాన్. అతడికి హైదరాబాద్ తో ఉన్న సంబంధం గురించి ఓ వీడియో విడుదల చేయడంతో అభిమానుల్లో ఆసక్తి కలుగుతోంది.

Shah Rukh Khan

షారుఖ్ ఖాన్ వాళ్ల అమ్మమ్మది హైదరాబాదే. దీంతో చిన్నప్పుడు టోలీచౌక్ లో ఉండేవాడు. చార్మినార్ చూసేందుకు రోజు వెళ్లి వచ్చేవాడట. ఇలా భాగ్యనగరంతో తనకున్న అనుబంధం గురించి షారుఖ్ చెప్పడంతో ప్రేక్షకులు సంబరపడుతున్నారు. బాలీవుడ్ బాద్ షాకు హైదరాబాద్ తో సంబంధం ఉందా అని ఆరా తీస్తున్నారు. తన అమ్మమ్మ వాళ్లది హైదరాబాద్ అని తెలియడంతో సంతోషపడుతున్నారు. బాలీవుడ్ నే ఏలుతున్న షారుఖ్ కు మన నగరంతో అనుబంధం ఉండటం నిజంగా మన అదృష్టమే.

Also Read: Sreemukhi: బాత్రూంలో శ్రీముఖి సెల్ఫీ.. వైరల్ నెట్టింట్లో రచ్చ

చిన్నతనంలో అమ్మమ్మ వాళ్లకు మగ పిల్లలు లేకపోవడంతో షారుఖ్ ను దత్తత ఇచ్చారు. దీంతో హైదరాబాద్ లోనే నాలుగేళ్లపాటు ఉన్నాడు. చివరకు తన అమ్మమ్మ వాళ్లు బెంగుళూరు వెళ్లిపోవడంతో షారుఖ్ ను మళ్లీ తీసుకెళ్లిపోయారట. షారుఖ్ ఖాన్ ఇప్పటివరకు 80 సినిమాల్లో నటించాడు. 14 ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకోవడం విశేషం. దేశంలోనే కాదు విదేశాల్లోనూ షారుఖ్ కు అభిమానులుండటం తెలిసిందే. అంతటి ఘనత సాధించుకున్న షారుఖ్ కు మన హైదరాబాద్ తో ఉన్న అనుబంధంతో అందరు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Shah Rukh Khan

షారుఖ్ పెట్టిన వీడియోతో అభిమానుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. షారుఖ్ ఖాన్ మనవాడే అనే భావన అందరిలో కలుగుతోంది. 1992లో దీవానా చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి ప్రవేశించాడు. అంతకుముందు టీవీ సీరియళ్లలో నటించేవాడు. అదృష్టం కలిసొచ్చి బాలీవుడ్ ను ఏలే అవకాశం కొట్టేశాడు. మొదట ప్రతినాయక పాత్రలు పోషించిన తరువాత హీరో పాత్రలు ధరించి తన సత్తా చాటుకున్నాడు. దుల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా ద్వారా తనలోని నటుడిని బయటపెట్టాడు. ఆ సినిమా ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. కాజల్ తో జంటగా నటించిన ఆ సినిమా ఏళ్లపాటు ఆడి రికార్డులు బద్దలు కొట్టింది.

Also Read:Anushka Shetty Marriage: పెళ్లి పీటలు ఎక్కబోతున్న స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి..పెళ్ళికొడుకు ఎవరో తెలుసా?

Tags