https://oktelugu.com/

ప్రియుడితో గంజాయ్ తాగి.. ముగ్గురితో రేప్ చేసుకొని.. యువతి నాటకం

హైదరాబాదీ అమ్మాయిలు ఇంత తెలివి మీరారని ఈ క్రైం సీన్ పరిశోధించాక కానీ పోలీసులకు తెలియలేదు. ప్రియుడి మోజులో పడి.. చెడు అలవాట్లకు బానిసైన యువతి.. ఆ ప్రియుడితోపాటు అతడి సోదరులతో కలిసి శృంగారం చేసి చివరకు తనను ఆటోడ్రైవర్లు ఎత్తుకెళ్లారని.. రేప్ చేశారని కట్టుకథలు చెప్పిన వైనం విస్తుగొలుపుతోంది. తాజాగా హైదరాబాద్ ఘట్ కేసర్ పరిధిలోని నాగారం చౌరస్తాలో ఫార్మసీ విద్యార్థిని అత్యాచార ఘటనలో పోలీసులు అసలు దోషి ఆ అమ్మాయినే అని కనిపెట్టారు. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 12, 2021 / 05:33 PM IST
    Follow us on

    m

    హైదరాబాదీ అమ్మాయిలు ఇంత తెలివి మీరారని ఈ క్రైం సీన్ పరిశోధించాక కానీ పోలీసులకు తెలియలేదు. ప్రియుడి మోజులో పడి.. చెడు అలవాట్లకు బానిసైన యువతి.. ఆ ప్రియుడితోపాటు అతడి సోదరులతో కలిసి శృంగారం చేసి చివరకు తనను ఆటోడ్రైవర్లు ఎత్తుకెళ్లారని.. రేప్ చేశారని కట్టుకథలు చెప్పిన వైనం విస్తుగొలుపుతోంది.

    తాజాగా హైదరాబాద్ ఘట్ కేసర్ పరిధిలోని నాగారం చౌరస్తాలో ఫార్మసీ విద్యార్థిని అత్యాచార ఘటనలో పోలీసులు అసలు దోషి ఆ అమ్మాయినే అని కనిపెట్టారు. ఈ కేసులో సృహలోకి వచ్చిన పోలీసులు యువతిని ప్రశ్నించడంతో అసలు నిజాలు వెలుగుచూశాయి.

    తనను ఆటోడ్రైవర్లు అపహరించి అత్యాచారం చేశారంటూ యువతి పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు వెల్లడైంది.

    తాజాగా సమాచారం ప్రకారం యువతి ఆటో ఎక్కిన మాట వాస్తవమే. అయితే రాంపల్లి వరకు వెళ్లి అక్కడి దిగా తన ప్రియుడి ద్విచక్రవాహనంపై కలిసి వెళ్లినట్లు పోలీసులకు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. ఆ తర్వాత ప్రియుడి ఇద్దరు సోదరులతో కలిసి గంజాయి సేవించింది. ఆ మత్తులోనే ఆమె అనుమతితోనే ఆ ముగ్గురు అత్యాచారం చేసినట్లు సమాచారం.

    తల్లి తరచూ ఫోన్లు చేస్తుండడంతో ఆటో డ్రైవర్లు గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారని ఆ యువతి చెప్పింది. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో సైరెన్లు వినిపించగా.. భయపడిన యువకులు ఆమెను రహదారి పక్కన వదిలేసి పారిపోయారు.

    గస్తీ కాస్తున్న పోలీసులకు యువతి కనిపించింది. మత్తులో ఉన్న ఆమెను పోలీసులు ఆస్పత్రిలో చేర్చి తాజాగా ప్రశ్నించగా.. ముందుగా ఆటోడ్రైవర్లు అత్యాచారం చేశారని తెలిపింది.

    ఆటోడ్రైవర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఆచూకీ దొరకలేదు. సీసీ టీవీ కెమెరాలను పరిశీలించగా యువతి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నట్టు కనిపించింది. స్నేహితులతో కలిసి వెళ్లానని.. మత్తులో తనపై ప్రియుడు అతడి సోదరులు అత్యాచారం చేసినట్లు ఆమె ఒప్పుకున్నట్లు సమాచారం. దీనిపై పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.