Sreemukhi Marriage Status: మూడు పదుల వయసు దాటినా పెళ్లి మాట ఎత్తడం లేదు శ్రీముఖి. పెళ్లి చేసుకోకపోవడం వలన ఎదురవుతున్న ఇబ్బందులను శ్రీముఖి ఓ వీడియోతో బయటపెట్టింది. ఆ మేటర్ ఏంటో చూద్దాం..
శ్రీముఖి(SREEMUKHI) పెళ్లి వార్త ఎవర్ గ్రీన్ టాపిక్. పలుమార్లు శ్రీముఖి వివాహం అంటూ కథనాలు వెలువడ్డాయి. హైదరాబాద్ కి చెందిన ఓ వ్యాపారితో శ్రీముఖి పెళ్లి కుదిరిందనే ప్రచారం జోరుగా నడిచింది. ఈ వార్తలను శ్రీముఖి ఖండించారు. ఆమె ఒకింత సీరియస్ అయ్యారు. అందుకు సమయం ఉంది. నిరాధారమైన కథనాలు ప్రచురించవద్దని మీడియా మీద ఫైర్ అయ్యింది. ఓ సందర్భంలో శ్రీముఖి… 30 ఏళ్ళు నిండాక వివాహం చేసుకుంటానని చెప్పింది. కానీ శ్రీముఖి ప్రస్తుత వయసు మూడు పదుల పైనే.
Also Read: ఇంద్ర భవనాన్ని మించి.. ఎన్టీఆర్ కొత్త ఇల్లు చూస్తే కళ్లు చెదురుతాయి
చెప్పాలంటే శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉంది. ప్రస్తుతం ఆమె టాప్ యాంకర్ అనడంలో సందేహం లేదు. అత్యధిక టీఆర్పీ రాబడుతున్న పలు షోలకు శ్రీముఖినే యాంకర్ గా ఉన్నారు. రష్మీ ఈటీవీకే పరిమితం కావడం, అనసూయ యాంకరింగ్ కి దూరమవ్వడం, సుమ షోలు తగ్గించడం శ్రీముఖికి కలిసొచ్చింది. శ్రీముఖి మంచి వక్త, తన ఎనర్జీతో ఆడియన్స్ ని అలరిస్తుంది. ఫేమ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. కెరీర్ లో పీక్స్ లో ఉండగా పెళ్లి చేసుకోవడం తెలివైన నిర్ణయం కాదని ఆమె భావిస్తూ ఉండొచ్చు.
అయితే ఆమెపై పెళ్లి ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తుంది. బహుశా కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తున్నారేమో…?. ఈ విషయాన్ని పరోక్షంగా తెలియజేసింది. శ్రీముఖి తన ఫ్రెండ్ ముక్కు అవినాష్ తో ఓ రీల్ చేసింది. ఆ రీల్ లో అవినాష్ ‘చెప్పు’ అంటాడు. దానికి శ్రీముఖి.. ‘చెప్పను… మళ్ళీ అడిగితే ఈ చెప్పను అనే మాట కూడా చెప్పను’ అని సమాధానం ఇస్తుంది. ఈ వీడియోకి ‘పెళ్లి కాని ప్రతి అమ్మాయి పరిస్థితి’ అనే నోట్ యాడ్ చేసింది.
Also Read: గోవాలో ప్రియుడు చేసిన రొమాంటిక్ పనిని బయటపెట్టిన కార్తీక దీపం శోభ! పెళ్లి కాకుండానే!
ఈ వీడియో మీనింగ్ ఏంటంటే… శ్రీముఖిని ప్రతి ఒక్కరూ పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారు అనిపిస్తుంది. లేదా పేరెంట్స్ ఒత్తిడి చేస్తూ ఉండొచ్చు. ఏదేమైనా శ్రీముఖికి అప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అర్థం అవుతుంది. మరోవైపు నటిగా కూడా శ్రీముఖి ప్రయత్నాలు చేస్తుంది. ఆఫర్స్ వస్తున్నప్పటికీ ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయాలని ఆమె వెయిట్ చేస్తున్నట్లు సమాచారం. శ్రీముఖి క్రేజీ అంకుల్స్, హ్యాపీ బర్త్ డే చిత్రాల్లో హీరోయిన్ రోల్స్ చేసింది. పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్, చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది.
View this post on Instagram