https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: ఆ పని చేస్తే గట్టి హగ్ ఇస్తా… పల్లవి ప్రశాంత్ కి శ్రీముఖి క్రేజీ ఆఫర్, వీడియో వైరల్!

ప్రశాంత్ ఇది ఫన్నీ టాస్క్. నువ్వు విన్ అయితే హగ్ ఇస్తా... ఓడిపోతే టైట్ హగ్ ఇస్తా అని చెప్పింది. దాంతో పల్లవి ప్రశాంత్ నవ్వుతూ మెలికలు తిరిగాడు. అమర్ రవితేజ చిత్రంలోని 'గోంగూర తోట కాడ కాపు కాశా' సాంగ్ పాడాడు.

Written By:
  • NARESH
  • , Updated On : December 16, 2023 / 01:11 PM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. శనివారం నుండే సందడి షురూ చేశారు. హౌస్లోకి స్టార్ యాంకర్ శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. బ్లాక్ స్కర్ట్ లో శ్రీముఖి సూపర్ హాట్ గా ఉంది. కంటెస్టెంట్స్ తో ఆటలు ఆడిస్తూ పిచ్చ ఎంటర్టైన్ చేసింది. నెక్స్ట్ వీక్ నుండి సూపర్ సింగర్ స్టార్ మాలో ప్రసారం కానుందని చెప్పింది. కంటెస్టెంట్స్ కంగ్రాట్స్ చెప్పారు. ఈ సందర్భంగా కంటెస్టెంట్స్ కి శ్రీముఖి సింగింగ్ ఆడిషన్స్ పెట్టింది. ప్రతి ఒక్కరూ మైక్ వద్దకు వచ్చి పాట పాడాలి. ఈ టాస్క్ లో పల్లవి ప్రశాంత్ కి శ్రీముఖి ఓ క్రేజీ ఆఫర్ ఇచ్చింది.

    ప్రశాంత్ ఇది ఫన్నీ టాస్క్. నువ్వు విన్ అయితే హగ్ ఇస్తా… ఓడిపోతే టైట్ హగ్ ఇస్తా అని చెప్పింది. దాంతో పల్లవి ప్రశాంత్ నవ్వుతూ మెలికలు తిరిగాడు. అమర్ రవితేజ చిత్రంలోని ‘గోంగూర తోట కాడ కాపు కాశా’ సాంగ్ పాడాడు. అమర్ పాటకు అర్జున్ కౌంటర్ ఇచ్చాడు. నువ్వు పాట పడుతున్నట్లు లేదు, నీ కోరికలు బయట పెడుతున్నట్లు ఉందని అన్నాడు. అనంతరం అర్జున్ ఒక పాట పాడాడు.

    అనంతరం ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడారు. ఈ గేమ్ లో యావర్ వంతు వచ్చింది. ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్ పేర్లు చెప్పిన శ్రీముఖి… వీరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావ్? ఎవరిని చంపేస్తావ్? ఎవరితో డేట్ కి వెళతావ్? అని అడిగింది. అశ్వినిని పెళ్లి చేసుకుంటానని యావర్ చెప్పడంతో… హౌస్ మేట్స్ షాక్ అయ్యారు. మనోడు సిగ్గుపడుతూ గట్టిగా నవ్వేశాడు. శ్రీముఖి నేడు కంటెస్టెంట్స్ తో పలు సరదా ఆటలు ఆడించింది.

    లేటెస్ట్ ప్రోమో ఈ ఆసక్తికర అంశాలతో కూడుకొని ఉంది. అయితే ఫినాలేకి ముందు రోజే… శ్రీముఖి రూ. 20 లక్షలు ఆఫర్ చేసినట్లు ప్రచారం అవుతుంది. విన్నర్ కి మాత్రమే ప్రైజ్ మనీ ఇస్తారు కాబట్టి, టైటిల్ రేసులో లేను అనుకున్నవాళ్ళు ఈ డబ్బులు తీసుకుని బయటకు వెళ్లిపోవచ్చని శ్రీముఖి చెప్పిందట. అయితే ఎవరూ ఆ డబ్బులు తీసుకునేందుకు ఒప్పుకోలేదని సమాచారం.