https://oktelugu.com/

గల్లీబాయ్స్ తో శ్రీముఖి రచ్చ !

గల్లీబాయ్స్ గ్యాంగ్ అంటూ సద్దాం బ్యాచ్ ‘అదిరింది’ షోలో చేసే రచ్చ గురించి ఆ షో ఫాలో రెగ్యులర్ ఆడియన్స్ కు బాగా తెలుసు. ఇప్పటికే గల్లీబాయ్స్ టీం లీడర్ సద్దాం అనే వ్యక్తి కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో బాగానే ఫేమస్ అవుతున్నాడు. దానికి తోడు సద్దాం తనను తాను హైపర్ ఆది రేంజ్‌ లో పోల్చుకోవడం.. స్కిట్స్ కూడా ఆ రేంజ్ లోనే రాస్తుండటంతో తక్కువ టైంలోనే బాగానే క్రేజ్ సంపాదించుకున్నాడు. […]

Written By:
  • admin
  • , Updated On : October 1, 2020 / 03:45 PM IST
    Follow us on


    గల్లీబాయ్స్ గ్యాంగ్ అంటూ సద్దాం బ్యాచ్ ‘అదిరింది’ షోలో చేసే రచ్చ గురించి ఆ షో ఫాలో రెగ్యులర్ ఆడియన్స్ కు బాగా తెలుసు. ఇప్పటికే గల్లీబాయ్స్ టీం లీడర్ సద్దాం అనే వ్యక్తి కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో బాగానే ఫేమస్ అవుతున్నాడు. దానికి తోడు సద్దాం తనను తాను హైపర్ ఆది రేంజ్‌ లో పోల్చుకోవడం.. స్కిట్స్ కూడా ఆ రేంజ్ లోనే రాస్తుండటంతో తక్కువ టైంలోనే బాగానే క్రేజ్ సంపాదించుకున్నాడు. మొదట పటాస్ చేసే సమయంలోనే మంచి కామెడీ స్కిట్స్ రాస్తాడనే పేరును సంపాదించిన సద్దాంకు అదిరింది షో గొప్ప అవకాశంలా లభించింది.

    Also Read: పూరి విశ్లేషణ: ధనవంతులు దేశం విడిచి ఎందుకు పోతున్నారు?

    అయితే అతను అదిరిందిలో ఎక్కువుగా ఎప్పుడూ ఒకే విధమైన కామెడీ చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నా.. అలాంటి కామెడీతోనే సద్దాం ముందుకుపోతున్నాడు. ఇక ఈ గల్లీ గ్యాంగ్‌లో యాదమ్మ రాజు కూడా మంచి కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ నే. పటాస్ వేదిక మీద లేడీ గెటప్పులు వేస్తూ తెలంగాణ యాసలో కామెడీ చేసే ఈ యాదమ్మ రాజు కూడా ‘అదిరింది’ షోతో బాగానే ఫేమస్ అవుతున్నాడు. పైగా ఆ మధ్య వినాయక చవితికి చేసిన బాపు బొమ్మకు పెళ్లంటా అనే ఈవెంట్‌ లో ఏకంగా తన ప్రియురాలిని పరిచయం చేస్తూ స్కిట్ చేయడంతో ఈ కుర్రాడికి మరింత క్రేజ్ వచ్చింది. దీనికి తోడు స్టేజ్ మీదే రొమాన్స్ చేసి అదరగొట్టేశాడు. దాంతో యూత్ లో యాదమ్మ రాజు అంటే తెలియకుండానే చిన్న స్మైల్ వచ్చేస్తోంది.

    Also Read: అదే హీరో నాని సినిమాలు ఆడకపోవడానికి కారణమా?

    మరి ఇలాంటి గల్లీబాయ్స్ గ్యాంగ్‌ లో బబ్లీ బ్యూటీ శ్రీముఖి తోడైతే ఇక ఎలా ఉంటుంది. అసలుకే బోల్డ్ కామెడీకి శ్రీముఖి పెట్టింది పేరు. ఇప్పుడు అలాంటి బోల్డ్ జోక్స్ తో ఫేమస్ అయిన గల్లీబాయ్స్ తో తాజాగా శ్రీముఖి ఓ ఈవెంట్‌ లో సందడి చేసిందట. ఈ క్రమంలో శ్రీముఖి ఎప్పటిలాగే సద్దాం గ్యాంగ్‌ తో రచ్చ రచ్చ చేసిందట. పెద్ద పెద్దగా అరుస్తూ పాటలు పాడుతూ ఫుల్ ఎంటర్ టైన్ చేసిందట. ముఖ్యంగా జాను సినిమాలోని లైఫ్ ఆఫ్ రామ్ పాటను సద్దాం దారుణంగా పాడి.. అక్కడున్న వారిని ఫుల్ గా నవ్వించాడు. ఇక యాదమ్మ రాజు కూడా ఓ పాటను దారుణంగా పాడుతూ ఉండగా.. ఇదంతా వీడియో తీస్తూ శ్రీముఖి కూడా పకపక నవ్వేసింది. మరి వీరంతా ఇంతకీ ఎక్కడ కలిశారో !