ట్రంప్ ఇటీవలే హెచ్1బీ వీసాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 60 రోజుల పాటు హెచ్1బీ వీసాలను రద్దు చేసిన అధ్యక్షుడు ట్రంప్.. ఆ తర్వాత దాన్ని డిసెంబర్ వరకూ పొడిగించారు. ఆ తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హెచ్1 బీ వీసాలతోపాటు హెచ్2బీ, ఎల్1 వీసాలకు దీన్ని వర్తింప చేశారు. ఇప్పుడు ఆయన ప్రత్యర్థి వలసవాదులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు నిలుస్తారన్నది ఆసక్తిగా మారింది.
Also Read: అప్పుల్లో కేంద్రం.. ఇక ప్రజలకు ప్యాకేజీలు లేవట?
అధ్యక్షుడైనప్పటి నుంచి ట్రంప్ అమెరికన్లే ఫస్ట్ అంటున్నారు. ఈ క్రమంలోనే వలసవాదులకు షాకిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ సర్కార్ పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ ఫీజులను పెంచారు. అక్టోబర్ 2 నుంచి ఇవి అమెరికాలో అమలులోకి రావాల్సింది.
ట్రంప్ సర్కార్ తాజాగా గ్రీన్ కార్డులకు, పౌరసత్వ హక్కులకు తాత్కాలిక వర్క్ పర్మిట్ లకు ఫీజులను 20శాతం మేర పెంచారు. హెచ్1 బి వీసా ఫీజు ప్రస్తుతం 460 డాలర్ల నుంచి 555 డాలర్లకు పెంచారు. పౌరసత్వ ఫీజుని 83శాతం పెంచి.. 640 డాలర్ల నుంచి 1170 డాలర్లుగా నిర్ణయించారు. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లగా ఊరట లభించింది.
Also Read: యూపీ ఉద్రిక్తం.. పోస్టుమార్టంలో దారుణ విషయాలు
పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ ఫీజులను పెంచడంపై 8 స్వచ్ఛంద సంస్థలు, ఇమ్మిగ్రెంట్ లీగల్ రిసోర్స్ సెంటర్ లు ఉమ్మడిగా ఈ పెంచిన ఫీజులను వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లగా భారీగా పెంచిన పౌరసత్వ , ఇమ్మిగ్రేషన్ ఫీజులను నిలిపివేస్తూ అమెరికా ఫెడరల్ జడ్జి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వీటిని తక్షణం నిలిపివేశారు. ఇద్దరు సీనియర్ హోంసెక్యూరిటీ డిపార్ట్ మెంట్ అధికారులను చట్టవిరుద్ధంగా నియమించారని జడ్జి మండిపడ్డారు. ఫెడరల్ నియమం ప్రకారం ఈ ఫీజులను ఎందుకు పెంచారో వివరించడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని.. అందుకే ఫీజుల పెంపును అడ్డుకున్నానని జడ్జి తెలిపారు.