https://oktelugu.com/

స్టార్ డైరెక్టర్ చుట్టూ తిరుగుతున్న హీరో !

గత కొన్ని సినిమాలుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న సందీప్ కిషన్ ఎట్టకేలకూ మధ్యలో ‘నిన్ను వీడని నీడను నేనే’ అనే సినిమాతో చిన్న రేంజ్ హిట్ అందుకున్నా.. మార్కెట్ ను మాత్రం క్రియేట్ చేసుకోలేకపోయాడు. పైగా కోరుకున్న హిట్ రేంజ్ కూడా అందుకోలేకపోయాడు. అందుకే ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ల చుట్టూ తిరుగుతూ వారితో కనీసం ఒక్క సినిమా అన్నా చేయాలి అని సందీప్ కిషన్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే విజయ్ దేవరకొండ – సుకుమార్ […]

Written By:
  • admin
  • , Updated On : October 1, 2020 / 03:34 PM IST
    Follow us on

    గత కొన్ని సినిమాలుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న సందీప్ కిషన్ ఎట్టకేలకూ మధ్యలో ‘నిన్ను వీడని నీడను నేనే’ అనే సినిమాతో చిన్న రేంజ్ హిట్ అందుకున్నా.. మార్కెట్ ను మాత్రం క్రియేట్ చేసుకోలేకపోయాడు. పైగా కోరుకున్న హిట్ రేంజ్ కూడా అందుకోలేకపోయాడు. అందుకే ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ల చుట్టూ తిరుగుతూ వారితో కనీసం ఒక్క సినిమా అన్నా చేయాలి అని సందీప్ కిషన్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే విజయ్ దేవరకొండ – సుకుమార్ కాంబినేషన్ అని ఎనౌన్స్ చేశారో.. అప్పటి నుండి యంగ్ హీరోలకు ఆశ పట్టుకుంది. విజయ్ లానే తాము కూడా స్టార్ డైరెక్టర్లతో సినిమా ప్లాన్ చేద్దామని. కానీ మార్కెట్ రేంజ్ అనేది ప్లాన్ చేస్తే వచ్చేది కాదు కదా.

    Also Read: అదే హీరో నాని సినిమాలు ఆడకపోవడానికి కారణమా?

    నిజానికి సందీప్ కిషన్ ఎంతో ప్లాన్ చేసి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్’ సినిమా చేశాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ లాంటి ఫుల్ ఎంటర్ టైనర్ తో మంచి హిట్ అందుకున్న సందీప్ కిషన్, మళ్లీ ఆ తరువాత ఆ స్థాయిలో కామెడీ సినిమా ఇంతవరకూ చేయలేదు. మళ్ళీ అలాంటి ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలనీ.. అలాగే ఆ సినిమాకి స్టార్ డైరెక్టర్ అయి ఉండాలని సందీప్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

    సూపర్ హిట్ అందుకోవాలనే ఉద్దేశ్యంతో చేసిన ‘తెనాలి రామకృష్ణ’ ఎలాగూ డిజాస్టర్ అయింది కాబాట్టి.. ఆల్ రెడీ జి.నాగేశ్వర్ రెడ్డి తో కమిట్ అయిన మరో సినిమాని కూడా క్యాన్సల్ చేసుకున్నాడు. ప్రస్తుతం వంశీ పైడపల్లి చుట్టూ సందీప్ కిషన్ తిరుగుతునట్లు తెలుస్తోంది. తనకు రెమ్యునరేషన్ కూడా అక్కర్లేదు అని.. మీకు స్టార్ హీరో సినిమాకి ఇచ్చే రెమ్యునరేషన్ కంటే ఎక్కువ ఇస్తామని నాతో ఒక సినిమా చేయమని సందీప్ రిక్వెస్ట్ చేస్తున్నాడట.

    Also Read: పూరి విశ్లేషణ: ధనవంతులు దేశం విడిచి ఎందుకు పోతున్నారు?

    పైగా కథ కూడా ఆకుల శివ దగ్గర రెడీగా ఉందట. ఈ కథలో సిచ్యుయేషన్ కామెడీ చాలా బాగా వచ్చిందని సమాచారం. కథలో హీరో చుట్టూ జరిగే డ్రామా.. ఆ డ్రామా కారణంగా హీరో పడే ఇబ్బందులు.. ఆ ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి హీరో చేసే పనులు.. ఇలాంటి అంశాల చుట్టూ కథ ఫుల్ ఎంటర్ టైన్ గా న సాగుతుందట. మరి వంశీ ఏమంటాడో చూడాలి.