Anchor Sreemukhi: యాంకర్ గా శ్రీముఖి టాలెంట్ ఏంటన్నది బుల్లితెరతో పరిచయం ఉన్న ఆడియన్స్ అందరికీ తెలుసు. స్మాల్ స్క్రీన్ పై శ్రీముఖి చేసే సందడే వేరుగా ఉంటుంది. తనదైన మాటలతో, పంచ్ లతో రచ్చ చేస్తుంది. సూపర్ ఫాస్ట్ యాంకరింగ్ తో తక్కువ కాలంలోనే బెస్ట్ యాంకర్ గా పేరు తెచ్చుకుందీ బ్యూటీ. ఎలాంటి షో అయినా.. తనదైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చి తీరుతుంది. అయితే.. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ముక్కు అవినాష్ తో కలిసి చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
అల్లు అర్జున్ మూవీ ‘జులాయి’తో ఇండస్ట్రీకి పరిచయమైంది శ్రీముఖి. అందులో బన్నీ చెల్లిగా నటించింది. ఆ తర్వాత.. జబర్దస్త్ షోలో యాంకర్ గా అవకాశం వచ్చినప్పటికీ.. ఆమె చేయలేదు. అనంతరం పటాస్ షో ద్వారా యాంకర్ గా ప్రయాణం మొదలు పెట్టిన శ్రీ ముఖి.. అన్ని స్టేజీ షోలలోనూ దుమ్ములేపుతోంది. అయితే.. బుల్లితెరపై యాంకరింగ్ కొనసాగిస్తూనే.. వెండితెరపై టాలెంట్ నిరూపించుకుంటోంది.
ఈ క్రమంలోనే.. ‘క్రేజీ అంకుల్స్’ చిత్రంలో నటించిందీ యాంకర్. శ్రీముఖి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాలో.. ప్రముఖ గాయకుడు మనో, భరణి, రాజారవీంద్ర ముఖ్య పాత్రలు పోషించారు. ఆగస్టు 19న విడుదలైన ఈ చిత్రం ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్వూలో పలు వివరాలు వెల్లడించింది. ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందులు కూడా తెలిపింది. మొత్తానికి అన్ని కష్టాలను ఎదుర్కొని టాలెంటెడ్ ఆర్టిస్టుగా తనని తాను నిరూపించుకుంటోంది.
తాజాగా.. ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను అప్లోడ్ చేసింది శ్రీముఖి. కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు – వంటలక్క మధ్య జరిగే ఎమోషనల్ సన్నివేశంలో.. ముక్కు అవినాష్ – శ్రీముఖి కలిసి నటించారు. వీళ్ల పెర్ఫార్మెన్స్ కు మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా శ్రీముఖి ఎమోషనల్ డ్రామాను అద్భుతంగా పండించిందని, ఎక్స్ ప్రెషన్స్ సూపర్బ్ గా ఉన్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. అవినాష్ చెంపదెబ్బ కొట్టినప్పుడు శ్రీముఖి పెర్ఫార్మెన్స్ చాలా బాగుందని అంటున్నారు.
వీడియో కోసం క్లిక్ చేయండి..