Sreeleela: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 చిత్రాల వరకు సైన్ చేసింది శ్రీలీల. ఈ జనరేషన్ అప్ కమింగ్ హీరోయిన్స్ లో ఇదో రికార్డు అని చెప్పొచ్చు. పెళ్లి సందడి చిత్రంతో తెలుగులో అడుగుపెట్టిన శ్రీలీల ధమాకా చిత్రంతో హిట్ కొట్టింది. ఆ మూవీలో శ్రీలీల డాన్సులు, ఎనర్జీ చూసి ఆడియన్స్ ఫిదా అయ్యారు. దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. కుర్ర హీరోల నుండి సూపర్ స్టార్స్ వరకూ అందరూ శ్రీలీలను కోరుకుంటున్నారు. మహేష్ బాబుకు జంటగా గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తుంది.
విజయ్ దేవరకొండ, నితిన్, వైష్ణవ్ తేజ్ ల అప్ కమింగ్ చిత్రాల్లో శ్రీలీల హీరోయిన్. ఇటీవల స్కంద చిత్రంలో రామ్ పోతినేనికి జంటగా నటించింది. స్కంద మాత్రం నిరాశపరిచింది. దాదాపు రూ. 20 కోట్ల నష్టాలు మిగిల్చింది. త్వరలో శ్రీలీల భగవంత్ కేసరి చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. బాలకృష్ణ హీరోగా నటించగా శ్రీలీల అతని బిడ్డ పాత్ర చేసింది. కథలో ఆమె కీలకం అని తెలుస్తుంది. దసరా కానుకగా భగవంత్ కేసరి విడుదల కానుంది.
వరుస చిత్రాలతో జోరు మీదున్న శ్రీలీల కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. అయితే వ్యక్తిగతంగా ఆమె సమస్యలు ఎదుర్కొంటున్నారట. శ్రీలీలకు అరుదైన వ్యాధి ఉన్నట్లు సోషల్ మీడియా టాక్. సదరు కథనాల ప్రకారం… శ్రీలీల ఒక్కసారి తుమ్మితే ఆగకుండా 20 నిమిషాల వరకు తుమ్ముతూనే ఉంటుందట. ఆమెకు ఉన్న ఓ రుగ్మత కారణంగా ఇలా జరుగుతుందట. ఈ సమస్య ఆమెను చాలా కాలంగా వేధిస్తుందట.
ఎలాంటి ట్రీట్మెంట్స్ పూర్తిగా వ్యాధిని తగ్గించలేకపోయాయట. ఈ వ్యాధి కారణంగా శ్రీలీల చాలా సమస్యలు ఎదుర్కొన్నారట. షూటింగ్స్ లో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయట. ఈ వ్యాధి కారణంగా ఆమెకు పెళ్లి కావడం కూడా కష్టమే అంటున్నారు. గతంలో ఒకసారి శ్రీలీల తనకున్న ఈ సమస్య గురించి ఓపెన్ అయ్యారు. తనకు ముక్కులో ఓ రంధ్రంలో సమస్య ఉందన్నారు. ఆమె గొంతు కూడా జలుబు చేసినవాళ్లు మాట్లాడినట్లుగా ఉంటుంది. శ్రీలీల గురించి ఈ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.