ఇకమీద, సినిమా ఇండస్ట్రీ కరోనా కారణాన్ని చూపెట్టడానికి లేదు.. సినిమాలో దమ్మెంత ఉందన్నది మాత్రమే చూపెట్టాలి. ప్రేక్షకులు ఆల్మోస్ట్ పాత పద్ధతిలోకి వచ్చేసినట్టే. జనాల్లో కరోనా భయం పెద్దగా కనిపించట్లేదు. దీంతో.. థియేటర్లకు రావడానికి సంకోచించట్లేదు. సినిమాలో విషయం ఉండాలేగానీ.. టిక్కెట్ తెంపడానికి తాము రెడీ అంటున్నారు.
Also Read: ఓటమికి ‘చెక్’ చెప్పలేకపోయిన నితిన్.. బాక్సాఫీస్ వద్ద భారీ యాక్సిడెంట్.. నష్టం ఎంతంటే?
ఈ క్రమంలోనే.. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒకే రోజున మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అవి మూడు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రావడం.. మంచి అంచనాలతో విడుదల కావడంతో.. బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న సినిమా ఏదీ అనే ఉత్సాహం అందరిలోనూ నెలకొంది.
ఈ మూడు చిత్రాల్లో పెద్ద సినిమాగా ఉన్నది శర్వానంద్ శ్రీకారం. ఆ తర్వాత అనిల్ రావిపూడి బ్యాక్ బోన్ గా ఉన్న గాలి సంపత్.. చివరగా నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు ఉంటాయని లెక్కలు వేసుకున్నారు. కానీ.. రిలీజ్ దగ్గరపడే నాటికి అంచనాలు మారిపోయాయి. జాతిరత్నాలు మూవీ మంచి హైప్ తో రేసులో ముందుకు దూసుకొచ్చేసింది.
Also Read: సారంగా దరియాః కోమలి విజయం.. శేఖర్ కమ్ముల ఎమన్నారంటే..?
ఇక, శర్వానంద్ శ్రీకారం మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అటు గాలిసంపత్ కూడా విభిన్న కథాంశంతో రూపొందింది. ఈ విధంగా మూడు చిత్రాల మధ్యనా గట్టి పోటినే నెలకొంది. ఓపెనింగ్స్ విషయంలో పై రెండు చిత్రాలు పోటీ పడుతున్నాయి. అయితే.. తొలిరోజు టాక్ బట్టి వీటి భవితవ్యం తేలనుంది.
పండగ మూడ్.. వీకెండ్ ముందు ఉండడం.. వంటి కారణాలతో ప్రేక్షకులు థియేటర్ కు వచ్చేందుకు ఆసక్తి చూపించే ఛాన్స్ మెండుగా ఉంది. మరి, శివరాత్రి సింగం ఎవరన్నది ఈ వీకెండ్ ముగింపులో తేలనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్