Mass Maharaj Ravi Teja: మాస్ మహారాజ్ కు విలన్ గా ఆ హీరోయిన్ ?

Mass Maharaj Ravi Teja: మాస్‌ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలు కూడా చేయలేనంత స్పీడ్ గా వరుస సినిమాల్లో నటిస్తూ అందరికీ షాక్ ఇస్తున్నాడు. ఒకేసారి ఏకంగా 5 సినిమాలను లైన్‌ లో పెట్టారు రవితేజ. ఇప్పటికే ‘ఖిలాడీ’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో పడ్డ రవితేజ, ఈ సినిమా ఇంకా విడుదల కాక ముందే ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఇక ఈ సినిమాతో పాటు సుధీర్‌ వర్మ […]

Written By: Raghava Rao Gara, Updated On : January 6, 2022 10:40 am
Follow us on

Mass Maharaj Ravi Teja: మాస్‌ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలు కూడా చేయలేనంత స్పీడ్ గా వరుస సినిమాల్లో నటిస్తూ అందరికీ షాక్ ఇస్తున్నాడు. ఒకేసారి ఏకంగా 5 సినిమాలను లైన్‌ లో పెట్టారు రవితేజ. ఇప్పటికే ‘ఖిలాడీ’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో పడ్డ రవితేజ, ఈ సినిమా ఇంకా విడుదల కాక ముందే ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఇక ఈ సినిమాతో పాటు సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ అనే చిత్రంలో నటిస్తున్నారు రవితేజ. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి చిత్రయూనిట్‌ అధికారిక ప్రకటన కూడా చేసింది. కాగా సంక్రాంతి నుంచి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

సంక్రాంతి సందర్భంగా జవనరి 14న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమాను ప్రారంభించనున్నారాణి సమాచారం అందుతుంది. ఈ క్రమం లోనే నటీనటులను ఖరారు చేసే పనిలో పడింది చిత్రయూనిట్‌. కాగా ఈ సినిమాలో రవితేజాను ఓ లేడీ విలన్‌ ఢీకొట్టనున్నట్లు సమాచారం. ఈ పవర్‌ఫుల్‌ పాత్ర కోసం హీరోయిన్‌ను రంగంలోకి దించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఈ పాత్రకు దక్షా నగార్కర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

సినిమా కథ విన్న దక్షా నగార్కర్ తన పాత్ర నచ్చడంతో సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే హుషారు సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల భామ… తనదైన నటనతో కుర్రకారుకి బాగా దగ్గరైంది. ఆ తర్వాత జాంబిరెడ్డి చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది దక్షా. ఇక రావణాసుర సినిమాలో రవితేజ లాయర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఏ రేంజ్ లో అలరిస్తుందో అని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.