Sree Vishnu : ప్రముఖ యంగ్ హీరో శ్రీవిష్ణు(Sree Vishnu) రీసెంట్ గానే ‘సింగిల్'(#Single Movie) చిత్రం తో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. థియేటర్స్ లో ఈ చిత్రం వర్కింగ్ డేస్ లో కూడా స్టడీ కలెక్షన్స్ ని రాబడుతూ ఈ ఏడాది భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ లిస్ట్ లో ఒకటిగా చేరబోతోంది. అంతా సాఫీగా సాగిపోతుంది అని అనుకుంటున్న సమయం లో, ఇప్పుడు శ్రీవిష్ణు ఒక వివాదం లో చిక్కుకున్నాడు. ఆయన పై క్రైస్తవ మత సంఘాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. ఒక సినిమా అయితే యాదృచ్చికం అనుకోవచ్చు, ప్రతీ సినిమాలోనూ ఈమధ్య శ్రీవిష్ణు క్రైస్తవ మతాన్ని కించపరుస్తూ సన్నివేశాలు చేస్తున్నాడని, ఇది ఏ మాత్రం క్షమించరానిది అని, ఇతని సినిమాలను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా లో క్రైస్తవ మతానికి చెందిన వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ‘ఐటెమ్’ గా మారిపోయిన హీరో శ్రీ విష్ణు..ఆడియన్స్ కి ఊహించని షాక్..అసలు ఏమైందంటే!
క్రైస్తవ మతం లోనే లోపాలు ఉంటాయా..?, అతని మతం లో లోపాలు లేవా?, వాటిపై సన్నివేశాలు చేసే ధైర్యం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. శ్రీవిష్ణు మామూలుగా ఇలాంటి వివాదాలకు చాలా దూరం, తన సింగల్ మూవీ ట్రైలర్ లో కన్నప్ప చిత్రం పై సెటైర్స్ వేసాను అన్నట్టుగా జనాల్లోకి వెళ్లిందని బహిరంగ క్షమాపణలు చెప్పుకొచ్చిన వ్యక్తి ఆయన. సోషల్ మీడియా లో జరుగుతున్న ఈ వివాదం పై ఆయన స్పందిస్తాడో లేదో చూడాలి. అయినా శ్రీవిష్ణు చిన్న హీరో, డైరెక్టర్స్ ఏది చెప్తే అదే చేస్తాడు, డైరెక్టర్స్ ని శాసించి నా సినిమాలో ఇవే ఉండాలి అని చెప్పే స్థాయికి శ్రీవిష్ణు ఇంకా వెళ్ళలేదు, బహుశా ఇంకో రెండు సినిమాలు హిట్ అయితే ఆ రేంజ్ కి వెళ్లొచ్చు ఏమో. డైరెక్టర్స్ చేసే తప్పులకు కేవలం శ్రీవిష్ణు ని ఎందుకు నిందిస్తున్నారు అంటూ అతన్ని అభిమానించే వాళ్ళు సోషల్ మీడియా లో తిరిగి కౌంటర్లు ఇస్తున్నారు.
Also Read : ఒక్క హిట్ తో రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేసిన శ్రీ విష్ణు.. ఇది మరీ ఓవర్ గా లేదూ..?
ఇకపోతే శ్రీవిష్ణు ‘సింగిల్’ చిత్రం రీసెంట్ గానే 20 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంది. కేవలం వీకెండ్ తోనే అన్ని ప్రాంతాల్లోని బయ్యర్స్ కి లాభాలను చూపించి ముందుకు దూసుకుపోతున్న ఈ సినిమా ఫుల్ రన్ లో 40 కోట్ల గ్రాస్ మార్కుని కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే కనుక జరిగితే శ్రీవిష్ణు తన మార్కెట్ పరిధి ని పెంచుకున్నట్టే. అయితే ఆయన గత సూపర్ హిట్ ‘సామజవరగమనా’ కి నార్త్ అమెరికా లో 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సింగిల్ చిత్రానికి ఆ రేంజ్ గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వడం ప్రస్తుతానికి కష్టం గానే అనిపిస్తుంది. కానీ హాఫ్ మిలియన్ మార్కుని మాత్రం అందుకునే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఈ చిత్రాన్ని నిర్మించిన అల్లు అరవింద్ శ్రీ విష్ణు తో మరో సినిమా చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు.