Spirit :రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) అభిమానులతో పాటు, కోట్లాది మంది మూవీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘స్పిరిట్'(Spirit Movie). సందీప్ వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించబోతున్న ఈ మూవీ పై అంచనాలు షూటింగ్ ప్రారంభం కాకముందు నుండే భారీ స్థాయిలో ఉన్నాయి. కానీ ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అనే దానిపై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ప్లాన్ ప్రకారం ఈ ఏడాదే సెట్స్ మీదకు వెళ్ళాలి, కానీ ప్రభాస్ ఇంకా ‘రాజా సాబ్’, హను రాఘవపూడి తో చేస్తున్న చిత్రాలను పూర్తి చేయాలి. ఇప్పటి వరకు విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్న ప్రభాస్, త్వరలోనే హైదరాబాద్ కి తిరిగొచ్చి ‘రాజా సాబ్’ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. సుమారుగా 45 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ కి ఆయన డేట్స్ ని కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పటికే హను రాఘవపూడి తో ఆయన చేస్తున్న చిత్రం షూటింగ్ కొంతవరకు పూర్తి అయ్యింది.
Also Read : స్పిరిట్ సినిమాలో నటిస్తున్న తెలుగు స్టార్ హీరో…
అయితే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఇందులో హీరోయిన్ గా దీపికా పదుకొనే(Deepika Padukone) ని ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ దీపికా పదుకొనే తో కలిసి ‘కల్కి’ చిత్రం లో నటించాడు, త్వరలోనే ఆమెతో కలిసి ‘కల్కి 2’ లో కూడా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టే ముందే ఆమె ప్రభాస్ తో ‘స్పిరిట్’ మూవీ చేయబోతుంది. ఈ సినిమాలో నటించేందుకు దీపికా దాదాపుగా 20 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆ రేంజ్ రెమ్యూనరేషన్ అంటే కచ్చితంగా ఇండియా లోనే హైయెస్ట్ అని చెప్పొచ్చు. మన సౌత్ హీరోయిన్స్ ఇప్పటి వరకు పది కోట్ల రూపాయలకు మించి రెమ్యూనరేషన్ ని తీసుకోవడం లేదు.
అదే విధంగా బాలీవుడ్ లో అలియా భట్, కత్రినా కైఫ్, శ్రద్దా కపూర్ వంటి హీరోయిన్స్ 15 కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నారు. వాళ్లందరినీ ఇప్పుడు దీపికా పదుకొనే దాటేసింది. పెళ్ళై ఒక బిడ్డకు జన్మని ఇచ్చిన తర్వాత కూడా ఆమె క్రేజ్ ఇసుమంత కూడా తగ్గకపోవడం గమనార్హం. సాధారణంగా ఏ హీరోయిన్ కి అయినా పెళ్లి తర్వాత , ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత ఆ హీరోయిన్ వైపు కూడా చూసేందుకు ఇష్టపడరు దర్శక నిర్మాతలు. కానీ దీపికా రేంజ్ వేరు. ఆమె అందగత్తె అనడం కంటే, ఒక మహానటి అనొచ్చు. ఆమె సినిమాకు అవసరం లేదు, సినిమాకే ఆమె అవసరం కాబట్టి దర్శక నిర్మాతలు దీపికా పదుకొనే ని అసలు వదలరు. కల్కి చిత్రం లో ఆమెది చాలా పవర్ ఫుల్ క్యారక్టర్, దానికి ఆమె మాత్రమే న్యాయం చేయగలదు అని సందీప్ వంగ పట్టు బట్టి 20 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ ఈ సినిమాకు ఎన్నుకున్నాడు.
Also Read : ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్ పై సెన్సేషనల్ అప్డేట్ ఇచ్చిన సందీప్ వంగ!