https://oktelugu.com/

Kaliyugam Movie: ‘కలియుగం’ ఎలా ఉంటుందో చూపిస్తానంటున్న జెర్సీ హీరోయిన్​

Kaliyugam Movie: జెర్సీ సినిమాతో టాలీవుడ్​ ప్రేక్షకులను అలరించిన హీరోయిన్​ శ్రద్దా శ్రీనాధ్​. ఈ సినిమాతోనే ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే, పెద్దగా అవకాశాలే తట్టలేదు. కాగా, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు శ్రద్ధా పెట్టింది పేరు. కన్నడలో ఇప్పటికే యూటర్న్​ సినిమాతో శ్రద్ధ చేసిన హంగామా మాములు కాదు. అందులో శ్రద్ధ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. The final shooting schedule of India's first post-apocalyptic movie, #Kaliyugam […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 28, 2021 / 02:18 PM IST
    Follow us on

    Kaliyugam Movie: జెర్సీ సినిమాతో టాలీవుడ్​ ప్రేక్షకులను అలరించిన హీరోయిన్​ శ్రద్దా శ్రీనాధ్​. ఈ సినిమాతోనే ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే, పెద్దగా అవకాశాలే తట్టలేదు. కాగా, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు శ్రద్ధా పెట్టింది పేరు. కన్నడలో ఇప్పటికే యూటర్న్​ సినిమాతో శ్రద్ధ చేసిన హంగామా మాములు కాదు. అందులో శ్రద్ధ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.

    తాజాగా, మరోసారి ఈ భామ మరో లేడీ ఓరియెంటెడ్​ సినిమాతో వచ్చేందుకు సిద్ధమైంది. తమిళ్​లో ప్రశాంత్​ సుందర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కలియుగం. ఈ సినిమాలోనే శ్రద్ధా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా కథ, కాన్సెప్ట్ చాలా భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్​ చేసే విధంగా తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాను హర్రర్ థ్రిల్లర్​గా తెరకెక్కిస్తున్నట్లు వివరించారు.

    Also Read: Samantha: బికినీలో సమంత.. శృతిమించిన అందాల ఆరబోత !

    కాగా, ప్రైమ్​ సినిమాస్​ బ్యానర్​పై కె.యస్.రామకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్​ స్టార్ట్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట్లో పోస్ట్ చేసి అప్​డేట్​ ఇచ్చారు. ఖర్చు విషయంలో ఎక్కడా నిర్మాతలు కాంప్రమైజ్​ అవ్వడం లేదని తెలుస్తోంది. ఈ సినిమాతో శ్రద్ధకు ఎలాంటి గుర్తింపు వస్తుందో తెలియాల్సి ఉంది. కాగా, నాని హీరోగా వచ్చిన జెర్సీలో హీరోయిన్​గా నటించి.. ఓ అమ్మగా, ప్రేమికురాలిగా తనదైన నటనతో ప్రేక్షకులను అలరించింది శ్రద్ధ. ఇప్పుడు ఈ సినిమాతో ఎలా కనిపించనుందో చూడాలి.

    Also Read: Tollywood Heroines: హీరోయిన్స్ అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. చూస్తే షాక్ అవుతారు..