https://oktelugu.com/

సీనియర్ ఎన్టీఆర్ – మెగాస్టార్’ వాయిస్ ఓవర్ తో ‘తారక్ – చరణ్’ టీజర్ !

జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ ప్రోమోను, ఆర్ఆర్ఆర్ యూనిట్ స్పెషల్ గా రెడీ చేయబోతుందట. పైగా ఈ స్పెషల్ ప్రోమోకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తారనే ప్రచారం కూడా ప్రస్తుతం జోరుగా సాగుతుంది. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయాన్ని పక్కన పెడితే.. ఈ న్యూస్ మాత్రం ఫ్యాన్స్ కు తెగ కిక్ ను ఇస్తోంది. అయితే, ప్రమోషన్స్ లో ఎలాంటి తొందరపాటు లేకుండా, ఓ పద్ధతి ప్రకారం పక్కా […]

Written By:
  • admin
  • , Updated On : January 5, 2021 / 10:30 AM IST
    Follow us on


    జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ ప్రోమోను, ఆర్ఆర్ఆర్ యూనిట్ స్పెషల్ గా రెడీ చేయబోతుందట. పైగా ఈ స్పెషల్ ప్రోమోకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తారనే ప్రచారం కూడా ప్రస్తుతం జోరుగా సాగుతుంది. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయాన్ని పక్కన పెడితే.. ఈ న్యూస్ మాత్రం ఫ్యాన్స్ కు తెగ కిక్ ను ఇస్తోంది. అయితే, ప్రమోషన్స్ లో ఎలాంటి తొందరపాటు లేకుండా, ఓ పద్ధతి ప్రకారం పక్కా ప్లాన్డ్ గా తన సినిమాని ప్రచారం చేసుకునే రాజమౌళి.. ఈ స్పెషల్ ప్రోమోకి ఒక స్పెషల్ ప్రమోషన్ ను ప్లాన్ చేశాడని కూడా ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

    Also Read: చెల్లెమ్మా.. తస్మాత్ జాగ్రత్త – ఎన్టీఆర్

    ఇంతకీ ఆ స్పెషల్ ప్రమోషన్ ఏంటంటే.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నుంచి రెండు టీజర్లు రిలీజ్ అయ్యాయి. వాటిల్లో రామ్ చరణ్ టీజర్ కి, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ టీజర్ కి, రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇప్పుడు వీళ్లిద్దరు కలిసి ఉండే టీజర్ కు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్, అలాగే ‘సీనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్’ (మిమిక్రీ చేయిస్తారట) ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా పై ఇప్పటికే ఇలాంటి పుకార్లు చాల వచ్చాయి. రాజమౌళి వాటిని వెంటనే ఖండిస్తూ వచ్చాడు. కానీ, ఈ స్పెషల్ ప్రోమో విషయంలో మాత్రం రాజమౌళి ఇంతవరకు ఖడించకపోవడంతో.. ఈ వార్తలో నిజం ఉందని అనిపిస్తోంది. మరి చూడాలి ఏమి జరుగుతుందో.

    Also Read: మహేష్ కి ‘రేణూ దేశాయ్’ వదిన కాదు, అక్కే !

    ఇక ఈ సినిమాలోని ప్రధాన పాత్రల కోసం దిగ్గజ నటీనటుల్ని ఎంపిక చేశారు రాజమౌళి. అజయ్ దేవగన్, ఒలీవియా మోరిస్, సముథిర ఖని తరహాలోనే లీయే స్కాట్ అనే ముఖ్యమైన పాత్ర కోసం ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. అలిసన్ డూడీ హాలీవుడ్లో పలు పెద్ద సినిమాల్లో నటించింది. అలాగే చరిత్రలో అసలు సంబంధమే లేని అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ కలుసుకుని ఒకరినొకరు ప్రభావితం చేసుకుంటే ఎలా ఉంటుంది, వారి మానసిక స్థితిగతులు ఎలా ఉండేవి అనే ఫిక్షనల్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్