ఆంధ్రప్రదేశ్లోని ఆలయాలపై వరుసగా దాడులు సాగుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలోని ఓ ఆలయంలోని విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. జిల్లాలోని సింగరాయకొండలోని లక్ష్మీనరసింహాస్వామి ఆలయంపై దాడి చేయగా దేవస్థానం ముఖద్వారంపై ఉన్న విగ్రహాం చేయి విరిగింది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఏపీలోని ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. విజయనగరం జిల్లాలోని రామతీర్థం ఆలయంలోని రాముడి విగ్రహం ధ్వంసానికి నిరసనగా మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరి బీజేపీ నాయకులను గ్రుహ నిర్బంధం చేశారు. మరికొందరు తప్పించుకొని రామతీర్థం వెళ్లగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.