Prabhas Spirit Update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో ఆయన చేసిన ‘అనిమల్’ సినిమా సూపర్ సక్సెస్ ను సాధించడమే కాకుండా 800 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఇప్పటికే సినిమా అనౌన్స్ చేసి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికి ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్ మీదకైతే వెళ్లలేదు. ప్రస్తుతం ప్రభాస్ కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం హను రాఘవపూడి తో చేస్తున్న ఫౌజీ మూవీ షూట్ ను కంప్లీట్ చేసుకొని స్పిరిట్ సినిమా మీద డేట్స్ కేటాయించాలని చూస్తున్నాడు. ప్రభాస్ యొక్క మొత్తం డేట్స్ తనకి కావాలని సందీప్ కోరుకోవడంతో అందుకే ఫౌజీ సినిమా పూర్తి చేసిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఈ సినిమా మీద డేట్స్ ని కేటాయించాలని ప్రభాస్ నిశ్చయించుకున్నాడు.
ఇప్పటికే స్పిరిట్ సినిమా కోసం రెండు సంవత్సరాల వెయిట్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాను చాలా ఎక్స్ట్రాడినరీ తెరకెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ కెరియర్ లో ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో కనిపించలేదని ఈ మూవీలో ఆయన క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందని సందీప్ రెడ్డి వంగ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
Also Read: ఎన్టీఆర్ కి ‘వార్ 2’ బిగ్ అలెర్ట్..ఇకపై ఇలాంటి రోల్స్ చేస్తే ఫ్యాన్స్ దూరం అవుతారా?
మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లను సాధిస్తే ఆయన నెంబర్ వన్ హీరోగా ఎదుగుతాడు. మరి సందీప్ రెడ్డి వంగ సినిమాతో అది సాధ్యమవుతుందనే ఉద్దేశ్యంతో ప్రభాస్ ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇప్పటికే ప్రభాస్ సినిమా కోసం 2 సంవత్సరాల పాటు తన డేట్స్ ను కేటాయించాడు…
ఇక ప్రభాస్ ను నమ్మి ఇంకా ఎన్ని రోజులు సందీప్ సినిమా మీదనే తన టైమ్ ను వేస్ట్ చేసుకుంటాడు అంటూ సందీప్ వంగ అభిమానులు సైతం ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలోనే సందీప్ ఈ సినిమాను వీలైనంత తొందరగా ఫినిష్ చేసి మరొక హీరోతో సినిమా చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు… స్పిరిట్ సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది…