War 2 Jr NTR Role: మన టాలీవుడ్ లో ఓపెనింగ్స్ అనే పదాన్ని తీసుకొస్తే మన అందరికీ గుర్తుకు వచ్చే పేర్లలో ఒకటి ఎన్టీఆర్(Junior NTR). టాక్ తో సంబంధం లేకుండా కళ్ళు చెదిరిపోయే రేంజ్ ఓపెనింగ్స్ పెట్టగల సత్తా ఉన్న హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. ఆయనకు సరైన సినిమా పడితే చూడాలని అభిమానులు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారు. టెంపర్ చిత్రం నుండి ఎన్టీఆర్ చేసిన ప్రతీ సినిమా హిట్. కానీ అవి పెద్దగా చెప్పుకోదగిన హిట్స్ కావు, మీడియం రేంజ్ హిట్స్ అనొచ్చు. అల్లు అర్జున్ కి ఒక ‘పుష్ప’, రామ్ చరణ్ కి ఒక ‘రంగస్థలం’, పవన్ కళ్యాణ్ కి ఒక ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’, ప్రభాస్ కి ఒక బాహుబలి..మహేష్ బాబు కి ఒక శ్రీమంతుడు, ఇలా గడిచిన 15 ఏళ్ళల్లో స్టార్ హీరోలందరికీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన సినిమాలు ఉన్నాయి, ఒక్క ఎన్టీఆర్ కి తప్ప.
ఆయన గత చిత్రం ‘దేవర’ కమర్షియల్ గా హిట్ అయినప్పటికీ, అది ఎన్టీఆర్ రేంజ్ కి తగ్గ సినిమా కాదనే టాక్ వచ్చింది. ఇక ఈరోజు విడుదలైన ‘వార్ 2’ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఇందులో చెప్పాలంటే హృతిక్ రోషన్ హీరో, ఎన్టీఆర్ విలన్ అన్నట్టు క్లైమాక్స్ వరకు చూపించారు. కానీ క్లైమాక్స్ లో అభిమానులను సంతృప్తి పరచడానికి కాస్త ఎన్టీఆర్ ని అప్పటికప్పుడు మంచోడిని చేసి చూపించారు. అభిమానులు అయితే ఎన్టీఆర్ క్యారక్టర్ పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు. #RRR సినిమా విడుదల సమయం లోనే ఎన్టీఆర్ క్యారక్టర్ బాగా తగ్గింది అంటూ అభిమానులు సోషల్ మీడియా లో రాజమౌళి ని ట్యాగ్ చేసి ఒక రేంజ్ లో తిట్టారు. ఇప్పుడు ‘వార్ 2′(War 2 Movie) కి అదే రేంజ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ రేంజ్ ఏంటి?, ఆయన చెయ్యాల్సిన సినిమాలు ఏంటి?, తీస్తున్న సినిమాలేంటి? అంటూ వాపోతున్నారు.
Also Read: తెలుగు హీరోలను కావాలనే నెగెటివ్ క్యారెక్టర్స్ లో చూపిస్తున్నారా..?
ఎన్టీఆర్ ఇక నుండి అయినా చేస్తే కల్కి రేంజ్ భారీ సినిమాలు చెయ్యాలి, సమయం ఎక్కువగా తీసుకున్నా పర్వాలేదు అంటూ సోషల్ మీడియా లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్స్. ప్రస్తుతం ఆయన చేతిలో ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ సినిమా మీద అయితే ప్రస్తుతానికి ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా మీద మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. కారణం ఇది కార్తికేయ స్వామి సంబంధించి ఎవరికీ తెలియని అధ్యాయం మీద తీస్తున్న సినిమా కాబట్టి. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇలాంటి సినిమాలే చేయాలనీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చూడాలి మరి ఆయన ప్లానింగ్ ఎలా ఉండబోతుంది అనేది.