Arjun Tendulkar Engagement: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ బుధవారం సానియా చందోక్ అనే యువతీతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ కార్యక్రమానికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకను సచిన్ కుటుంబం ఘనంగా నిర్వహించింది. సచిన్ టెండూల్కర్, అంజలి టెండూల్కర్, సారా టెండూల్కర్, ఇంకా కొంతమంది బంధువులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Also Read: ఇంగ్లాండ్ సిరీస్ లో రాణించినప్పటికీ వారిపై వేటు.. ఆసియా కప్ లో ఆడేది వీరే..
సచిన్ కుమారుడు అర్జున్ ఎంగేజ్మెంట్ చేసుకున్న యువతి పేరు సానియా చందోక్. ఈమె అర్జున్ టెండూల్కర్ కు చిన్ననాటి స్నేహితురాలు. సానియా కుటుంబానికి వ్యాపార నేపథ్యం ఉంది. ముంబై ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా. ఈమె సోషల్ మీడియాలో లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. బయట కూడా పెద్దగా కనిపించరు. దేశంలో మిస్టర్ పాస్ పేరు మీద తొలి పెట్ స్పా ను ముంబైలో ఏర్పాటు చేశారు. చిన్నప్పటినుంచి అర్జున్తో మాత్రమే కాకుండా సచిన్ కుటుంబంతో కూడా సానియాకు సాన్నిహిత్యం ఉంది. గతంలో అనేక సందర్భాలలో సారా తో కలిసి ఆమె ప్రపంచంలో పలు ప్రాంతాలను సందర్శించారు.

సానియా కుటుంబానికి వ్యాపార నేపథ్యం ఉండడంతో.. ఆమె కూడా విభిన్నమైన వ్యాపారాలను చేపడుతున్నారు. పెట్ స్పా ను ఏర్పాటుచేసి సంచలనం సృష్టించిన సానియా.. ఇంకా విభిన్నమైన వ్యాపారాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. త్వరలో ఒక ఎన్జీవో ని కూడా ఏర్పాటు చేయాలని ఆమె భావిస్తున్నారు. దీనిద్వారా పేదలకు.. యువతులకు సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వివిధ వ్యాపారాల ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని సానియా భావిస్తున్నారు. సానియా, అర్జున్ ఎంగేజ్మెంట్ నేపథ్యంలో.. సోషల్ మీడియాలో సారా గురించి చర్చ నడుస్తోంది. సారా ను అభిమానులు సోషల్ మీడియాలో పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు. సారా గిల్ తో సన్నిహితంగా ఉందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇటీవల కాలంలో ఆమె సిద్ధాంత్ చతుర్వేదితో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల యువరాజ్ సింగ్ తన చారిటీ కోసం లండన్లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు సచిన్ తన కుటుంబంతో కలిసి హాజరయ్యాడు. ఈ సమయంలో గిల్ – సారా మధ్య చూపులు బదిలీ అయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది.