Spirit : తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్(Prabhas)…ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ(Fouji) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్ (Spirit) అనే సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక స్పిరిట్ సినిమాలో సందీప్ రెడ్డివంగ కొన్ని బోల్డ్ సీన్స్ ను పెట్టినప్పటికి ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాననే ఉద్దేశంతో ఉన్నాడు. మరి ఈ సినిమాలో ప్రభాస్ కొద్దిసేపు సైకో టైప్ ఆఫ్ పాత్రలో కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంటే అతను ఎవరు ఏం చెప్పినా వినిపించుకోకుండా ఒక సైకో లాగా బిహేవ్ చేస్తారట. మరి దాని వల్ల అతనికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. ఆయన ఎలా రియలైజ్ అయ్యాడు. పోలీస్ ఆఫీసర్ గా ఎలా మారాడ. ఆయన సాధించాల్సిన లక్ష్యాలు ఏంటి అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే అంటూ సందీప్ రెడ్డివంగ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ చేస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ప్రభాస్ తనకంటూ ఒక భారీ గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఎవ్వరు సాధించనటువంటి ఒక గొప్ప గుర్తింపును కూడా తన సంపాదించుకుంటానని చాలా గర్వంగా చెబుతున్నాడు. ఇక ఫౌజీ,స్పిరిట్ రెండు సినిమాలతో ఆయన పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు.
Also Read : ప్రభాస్ స్పిరిట్ సినిమాలో కనిపించనున్న ఆర్జీవీ…ఆయన క్యారెక్టర్ ఏంటంటే..?
మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ సినిమా మీద పెద్ద గా హైప్ లేనప్పటికీ ప్రభాస్ చాలా రోజుల తర్వాత్ కమర్షియల్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమా మీద ఇప్పుడిప్పుడే అంతో ఇంత బజ్ అయితే క్రియేట్ అవుతుంది. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిమీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు.
కానీ మొత్తానికైతే ఈ సంవత్సరంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…ఇక ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియాలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఆయన చేస్తున్నటువంటి ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.
మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేయబోతున్న సినిమా ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటుంది. ఈ సినిమా ద్వారా ఆయన ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : స్పిరిట్ సినిమాలో ప్రభాస్ అన్న గా నటిస్తున్న స్టార్ హీరో…