Spirit One Bad Habit: త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోయే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాల్లో 2000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగలిగే సత్తా ఉన్న చిత్రం ‘స్పిరిట్'(Spirit Movie). సందీప్ వంగ(Sandeep Vanga) దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాకు యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యానిమల్,అర్జున్ రెడ్డి సినిమాలతో తాను యాక్షన్ మూవీస్ ని ఎంత బోల్డ్ గా తీయగలడో యూత్ ఆడియన్స్ ఒక గ్లింప్స్ లాగా చూపించాడు. ‘స్పిరిట్’ తో అసలు సినిమా చూపించబోతున్నాడు. ప్రభాస్(Rebel Star Prabhas) లాంటి యాక్షన్ హీరో కి, సందీప్ వంగ లాంటి డైరెక్టర్ తోడైతే ఎలా ఉంటుందో నిన్న ఆడియో టీజర్ ద్వారా సందీప్ వంగ శాంపిల్ చూపించాడు. సినిమాలో ఒక్క షాట్ ని కూడా చూపించకుండా కేవలం ఆడియో తో ఈ రేంజ్ గూస్ బంప్స్ రప్పించడం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఒక్క సందీప్ వంగ కి మాత్రమే సాధ్యమైంది.
ఇదంతా పక్కన పెడితే ఈ ఆడియో గ్లింప్స్ వీడియోలో సందీప్ వంగ ప్రభాస్ కి ఇచ్చిన ట్యాగ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్ గా మారిపోయింది. ఇందులో ఆయన ”ఇండియా’స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్” అనే ట్యాగ్ ఇచ్చాడు. ఇండియా లో ఎంతో మంది సూపర్ స్టార్స్ ఉన్నారు, కానీ ఒక్క ప్రభాస్ కి మాత్రమే ఆ ట్యాగ్ ఇవ్వడం పై సోషల్ మీడియా లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మన టాలీవుడ్ నుండే పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సాధించిన హీరోలు ప్రభాస్ తో పాటు అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారు ఉన్నారు. ఇక ఇండియా వైడ్ గా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రజినీకాంత్, హృతిక్ రోషన్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఉన్నారు. వీళ్లందరికంటే ప్రభాస్ తోపు అనే అర్థం వచ్చేలా ఆ టైటిల్ కార్డు ఉండడం తో వివాదాలకు దారి తీసింది.
ఒక ప్రభాస్ ఫ్యాన్స్ ఇండియా లోనే టాప్ మోస్ట్ డైరెక్టర్ తమ హీరో కి అలాంటి ట్యాగ్ ఇచ్చినందుకు గర్వపడుతుంటే, మరోపక్క రామ్ చరణ్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ తో కొట్లాడుతున్నారు . ఇలా సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా వీళ్ళ మధ్య జరిగే ఫ్యాన్ వార్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సందీప్ వంగ తన సినిమా హీరోలకు అలాంటి ట్యాగ్స్ ఇవ్వడం సర్వసాధారణం. యానిమల్ చిత్రం లో నటించిన రణబీర్ కపూర్ ని ‘సూపర్ స్టార్ రణబీర్ కపూర్’ గా ఆడియన్స్ కి పరిచయం చేసాడు. ఇప్పుడు ప్రభాస్ ని ‘ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్’ అనే ట్యాగ్ తో పరిచయం చేస్తున్నాడు. దీనిని బట్టీ ప్రభాస్ ని ఏ రేంజ్ లో చూపించబోతున్నాడా ఒక అంచనా కి రావొచ్చు.
