Reason behind Kaveri bus accident: అర్ధరాత్రి.. జాతీయ రహదారి.. కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు గ్రామం.. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. బస్సు కూడా వేగంగా పరుగులు పెడుతోంది. ఒక డ్రైవర్ పడుకుంటే.. మరో డ్రైవర్ వేగంగా బస్సును నడుపుతున్నాడు. ఇంతలోనే ఊహించని పరిణామం ఎదురైంది. వేగంగా పరుగులు పెడుతున్న బస్సు కుదుపులకు గురైంది. ఏం జరిగిందో తెలుసుకునే లోగానే ఘోరం చోటుచేసుకుంది.
టేకూరు ప్రాంతంలో కావేరీ ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సు అగ్నిప్రమాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది దాకా కన్నుమూశారు. మిగతా వాళ్ళంతా గాయపడ్డారు. కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు.. బస్సు సామర్థ్యంపరంగా బాగానే ఉంది.. అధికారులు కూడా దానికి సర్టిఫికెట్ ఇచ్చారు. మిగతా విషయాలలో కూడా బస్సుకు వంక పెట్టడానికి లేదు. అయితే అటువంటి బస్సు ఎందుకు ప్రమాదానికి గురైంది? ఉన్నట్టుండి ఏం జరిగింది? ఇప్పుడు ఈ ప్రశ్నలే అందరి మెదళ్లను తొలుస్తున్నాయి.
టేకూరు ప్రాంతంలోకి బస్సు ప్రవేశించగానే.. ద్విచక్ర వాహనం మీద ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి రాంగ్ రూట్లోకి వచ్చాడు. నిర్ణీత వేగంలో ఉన్న బస్సును కంట్రోల్ చేయడం డ్రైవర్ వల్ల కాలేదు. దీంతో ద్విచక్ర వాహనం నేరుగా బస్సు కిందికి దూసుకుపోయింది. ఈ క్రమంలో బస్సు వెళుతున్న వేగానికి.. నిప్పురవ్వలు ఏర్పడ్డాయి. ఆ నిప్పురవ్వలు డీజిల్ ట్యాంకర్ కు అంటుకున్నాయి. దీంతో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ప్రమాదం మరింత పెరిగింది. చూస్తుండగానే క్షణాలలో మంటలు వ్యాపించాయి. దీంతో బస్సులో ఉన్న వారంతా హాహా కారాలు చేశారు. హైవే మీద రాంగ్ రూట్లో వచ్చి ఈ ప్రమాదానికి కారణమైన ఆ వ్యక్తి పేరు శివ శంకర్ గా పోలీసులు గుర్తించారు. అతడిది కర్నూలు నగరంలోని ప్రజా నగర్ ప్రాంతమని పోలీసులు పేర్కొన్నారు. అయితే అతడికి బుధవారం పెళ్లిచూపులు జరిగినట్టు తెలుస్తోంది. పెళ్లిచూపులు పక్కనే పూర్తయిన తర్వాత అతని వేగంగా వెళుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాంగ్ రూట్లో రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కడు చేసిన పని ఏకంగా ఇంత మందిని బలి తీసుకుంది. అంతమంది గాయపడేందుకు కారణమైంది.