Spirit movie Vivek Oberoi role revealed: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు ‘సందీప్ రెడ్డి వంగ’… బోల్డ్ సినిమాతో సైతం ప్రేక్షకులను అట్రాక్ట్ చేయచ్చు అని ప్రూవ్ చేసిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాయి. ప్రస్తుతం ఆయన ‘స్పిరిట్’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. విలన్ గా వివేక్ ఓబెరాయ్ నటిస్తున్నాడు… రీసెంట్ గా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ని సైతం రిలీజ్ చేశారు… తన లుక్ చాలా వైల్డ్ గా ఉంది. అయితే ఈ సినిమాలో వివేక్ క్రూరమైన విలన్ గా కనిపించబోతున్నారట…
‘రక్త చరిత్ర’ సినిమాలో హీరోగా నటించిన వివేక్ ను విలన్ గా చూసే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. ఇక తన విలనిజాన్ని చాలా డిఫరెంట్ గా ప్రెసెంట్ చేస్తున్నారట. తన మాట వినకపోతే తన కుటుంబాన్ని సైతం చంపేసిన నరరూప రాక్షసుడిగా వివేక్ మనకు కనిపిస్తాడట… అలాంటి వ్యక్తిని పట్టుకోడానికి ప్రభాస్ ఎలాంటి ఎత్తులు వేస్తున్నాడు.
Also Read: ఆ విషయంలో కళ్యాణ్ రామ్ ను పట్టించుకోని దర్శకులు..కానీ అనిల్ రావిపూడి అలా కాదు..
ప్రభాస్ నుంచి తప్పించుకోవడానికి ఆయన ఎలాంటి వైఖరిని అనుసరిస్తున్నాడు అనేది చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుందట. మొత్తానికైతే ప్రభాస్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో చూపించబోతున్నాడు. ఇక పవర్ ఫుల్ విలన్ కూడా ఎలా ఉంటాడు అనేది వివేక్ ఒబెరాయ్ ను చూస్తే మనకు అర్థం అయిపోతుంది…
ఇక సందీప్ ఈ సినిమాతో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఈ సినిమాతో సందీప్ ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా మారుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…