Spirit Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో మంచి విజయాలను అందుకొని యంగ్ రెబల్ స్టార్ గా మారిపోయాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా ముందుకు సాగుతున్నాడు. ఎప్పుడైతే రాజమౌళి(Rajamouli)తో బాహుబలి (Bahubali) సినిమా చేశాడో అప్పటినుంచి పాన్ ఇండియాలో స్టార్ హీరోగా మారడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన హనురాఘావపూడి (Hanu Raghava Pudi) దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డివంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నాడు.
Also Read : వార్ 2′ లో 20 నిమిషాలు ఎన్టీఆర్ అలా కనిపించబోతున్నాడా..? ఫ్యాన్స్ కి పండగే!
ఇంకా ఈ రెండు సినిమాలు సైతం 2 వేల కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ క్రమంలోనే ప్రభాస్ (Prabhas) ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా సెంటిమెంటల్ గా కూడా ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక స్పిరిట్ సినిమాలో ఒక సిస్టర్ కూడా ఉంటుందట.
ఇక ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో కూడా ఉంటుందట. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కి సిస్టర్ గా ఒక స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని సందీప్ రెడ్డి వంగ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనే విషయంలో సరైన క్లారిటీ అయితే రావడం లేదు. కానీ మొత్తానికైతే ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లలో ఒకరిని ప్రభాస్ సిస్టర్ గా మార్చబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఒక్కసారి ప్రభాస్ సిస్టర్ గా క్యారెక్టర్ చేస్తే ఇక ఆమెకి హీరోయిన్ గా కెరియర్ అనేది ఉండదు. కాబట్టి ఎవరు ఆ పాత్రను చేయడానికి ఒప్పుకోవడం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి బాలీవుడ్ నుంచి ఎవరినైనా తీసుకొస్తారా లేదంటే సీనియర్ హీరోయిన్ ని అతనికి సిస్టర్ గా సెట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది…ఇక ప్రస్తుతం సందీప్ ఇదే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది…
Also Read : మే9 కూడా పోయినట్టే..దిక్కుతోచని స్థితిలో ‘హరి హర వీరమల్లు’ నిర్మాత!