Spirit Movie : కేవలం ప్రభాస్(Rebel Star Prabhas) అభిమానులు మాత్రమే కాదు, కోట్లాది మంది సినీ ప్రేమికులు ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘స్పిరిట్'(Spirit Movie). ప్రభాస్, సందీప్ వంగ(Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై షూటింగ్ ప్రారంభం కాకముందే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కనీసం షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుంది అనే దానిపైన కూడా పూర్తి సమాచారం లేకపోవడంతో అభిమానులు కాస్త అసహనానికి గురయ్యారు. అసలు ఈ ఏడాదిలో షూటింగ్ ఉంటుందా లేదా అనే సందిగ్ధంలో పడ్డారు. అయితే సందీప్ వంగ మాత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని పరుగులు తీయిస్తూనే ఉన్నాడు. ముందుగా ఆయన మ్యూజిక్ పై ద్రుష్టి సారించాడు. పలుమార్లు మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చొని పాటల దగ్గర నుండి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వరకు ప్రతీ ఒక్కటి పూర్తి చేయించాడు. తన ప్రతీ సినిమా ప్రారంభానికి ముందు ఆయనకు మ్యూజిక్ ని సిద్ధం చేసే అలవాటు ఉందట.
Also Read : చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటో తెలిసిపోయిందా..?
ఈ చిత్రానికి కూడా అదే సెంటిమెంట్ ని అనుసరించాడు. అంతే కాకుండా సినిమాలో పని చేయబోయే నటీనటుల ఎంపిక కూడా గుట్టు చప్పుడు కాకుండా పూర్తి చేసినట్టు సమాచారం. సుమారుగా ఏడాది నుండి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీ గా ఉన్న సందీప్ వంగ, ఎట్టకేలకు ఆ పనులన్నీ పూర్తి చేసే దిశలో ఉన్నాడట. మే మూడవ వారం లోపు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొత్తం పూర్తి అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. జూన్ నెలలో ఈ చిత్రాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అదే నెలలో రెగ్యులర్ షూటింగ్ ని కూడా మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ప్రస్తుతం మెక్సికో లో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. షూటింగ్ కూడా అత్యధిక శాతం మెక్సికో ప్రాంతం లోనే జరగబోతుందట. ఇందులో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు.
సందీప్ రెడ్డి వంగ లాంటి ఊర మాస్ డైరెక్టర్, ఊర మాస్ కటౌట్, యాటిట్యూడ్ ఉన్న ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేస్తే బాక్స్ ఆఫీస్ వసూళ్లు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించడానికి కూడా కష్టమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదిలా ఉండగా కొరియన్ లో ఎన్నో సూపర్ హిట్ యాక్షన్ మూవీస్ లో నటించిన డాన్ లీ ఈ చిత్రంలో విలన్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ, అనధికారికంగా మాత్రం ఆయన ఈ సినిమాలో నటించబోతున్నట్టు నిర్ధారణ అయ్యింది. అదే విధంగా ఎవ్వరూ ఊహించని యాక్టర్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నారట. వచ్చే ఏడాది వేసవి లో ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ని పరిశీలిస్తున్నారట. ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియన్స్ ని ఈమేరకు అలరిస్తుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.
Also Read : ఆ మూవీ చూసి మహేష్ బాబు మీద కోపాన్ని పెంచుకున్న రాజమౌళి…