Akkada ammayi Ikkada abbayi : బుల్లితెరపై యాంకర్ గా నెంబర్ 1 స్థానం లో కొనసాగుతూ , అకస్మాత్తుగా అన్ని టీవీ చానెల్స్ లో కనిపించడం మానేసిన ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju), చాలా కాలం తర్వాత ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి'(Akkada ammayi.. Ikkada abbayi) అనే చిత్రంతో మన ముందుకు నేడు వచ్చాడు. అసలు ప్రదీప్ కి అవసరమా ఇదంతా?, ఈ సినిమా కోసం బంగారం లాంటి యాంకరింగ్ రంగాన్నివదిలేసాడు. ఒకవేళ సినిమా హిట్ అవ్వకపోతే పరిస్థితి ఏమిటి?, కెరీర్ రిస్క్ లో పడే అవకాశం ఉంది కదా అని సోషల్ మీడియాలో నెటిజెన్స్ ఎన్నో కామెంట్స్ చేశారు. ఆయన మొదటి చిత్రం ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద రేంజ్ కి వెళ్ళడానికి ముఖ్య కారణం ‘నీలి నీలి ఆకాశం’ పాట వల్లనే అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
కానీ ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ పాటలు ఒక్కటి కూడా ఆ స్థాయిలో క్లిక్ అవ్వలేదు. కానీ పర్వాలేదు, ఒక మోస్తారుగా ఉన్నాయి అని అనిపించాయి. అదే విధంగా థియేట్రికల్ ట్రైలర్ కూడా చూసేందుకు చాలా డీసెంట్ గా అనిపించింది కానీ, ఆ ట్రైలర్ కారణంగా టికెట్స్ సేల్ అవుతాయి అనే గ్యారంటీ మాత్రం రాలేదు. ఇక ప్రమోషన్స్ ని కూడా చాలా విన్నూతన రీతిలో చేశారు. టీవీ, యూట్యూబ్ ఏది వదలలేదు, అన్నిటిని వాడేశారు. ఇక చివరికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని కూడా ఈ సినిమా కోసం తీసుకొచ్చారు. ఆయన చేత మొట్టమొదటి టికెట్ ని కొనుగోలు చేయించి, ఒక స్పెషల్ వీడియో ని విడుదల చేశారు. ఇవన్నీ కాస్త ఓపెనింగ్స్ కి వర్కౌట్ అవ్వుద్ది అని అనుకున్నారు కానీ, అసలు వర్కౌట్ అవ్వలేదు. బుక్ మై షో యాప్ లో కనీసం ట్రెండింగ్ లోకి కూడా ఈ చిత్రం రాలేకపోయింది.
కానీ సినిమాని చూసిన వాళ్ళు మాత్రం సోషల్ మీడియా లో మంచి పాజిటివ్ టాక్ చెప్తున్నారు. కామెడీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా కుదిరిందట. చక్కగా కుటుంబ సమేతంగా థియేటర్ కి వెళ్లి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రాన్ని తీశారట. కానీ టాక్ సరిగా జనాల్లోకి వెళ్ళలేదు. అందుకే ఓపెనింగ్స్ నిల్. కనీసం పాజిటివ్ రివ్యూస్ ని చూసి అయినా సరే ఈ చిత్రాన్ని ఆడియన్స్ ఆదరిస్తారో లేదో చూడాలి. ప్రదీప్ ఈ చిత్రం కోసం రెండేళ్ల పాటు ఎంటర్టైన్మెంట్ షోస్ కి యాంకరింగ్ చేయడం వదులుకున్నాడు. కారణం టీవీ లో చూసి చూసి అలవాటైన ప్రదీప్ ని ఒక్కసారిగా వెండితెర పై చూడమంటే కష్టమే అని ఫీలింగ్ జనాల్లోకి వస్తుందనే భయంతోనే ప్రదీప్ యాంకరింగ్ కి బ్రేక్ ఇచ్చినట్టు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు. అంతటి డెడికేషన్ ని జనాలు గుర్తిస్తారో లేదో చూడాలి.