Spirit Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం ఈయన చేస్తున్న వరుస సినిమాలు ఇండస్ట్రీ ని షేక్ చేస్తున్నాయనే చెప్పాలి. ఆయన చేసిన ‘అనిమల్ ‘ సినిమాతో ఒక్కసారిగా తను పాన్ ఇండియాలో తన సత్తా చాటబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో రన్బీర్ కపూర్ హీరోగా నటించగా, రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా తీయడం వల్ల సందీప్ ని చాలా మంది విమర్శించినప్పటికి, ఆయన మాత్రం ఎవ్వరికి భయపడకుండా తను చేసిన సినిమాలో తప్పు ఏమీ లేదు అంటూ వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాడు. నిజానికి ఆయన చేసిన సినిమా బాగుంది. కాబట్టే ఆ సినిమా దాదాపు 900 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ఆ సినిమా కొంచెం తేడా కొట్టినా కూడా ప్లాప్ అయ్యేది.
ఇక మొత్తానికైతే ఆయన చేసిన సినిమా బాగుందా లేదా అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. కాబట్టి సందీప్ కి ప్రేక్షకుల దృష్టిలో మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తుంది.
ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఒక సెట్ కోసం దాదాపు 40 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఇది కీలకమైన సెట్ అని కూడా తెలుస్తుంది. ఇక దాదాపు 25% షూట్ మొత్తం ఈ సెట్ లోనే జరగబోతుంది. అందువల్లే ఆ సెట్ కోసం అంతలా ఖర్చు పెడుతున్నట్టుగా సినిమా యూనిట్ తెలియజేస్తుంది. ఇక మొత్తానికైతే సందీప్ రెడ్డివంగా వరుస సక్సెస్ లను కొడుతూ ముందుకు దూసుకెళ్లడం అనేది ఒక రకంగా మంచి విషయం అనే చెప్పాలి. ఇక స్పిరిట్ సినిమాతో సందీప్ 2000 కోట్ల కలెక్షన్స్ ను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది…